పరీక్షల ను పరిశీలించిన కలెక్టర్.
80.64 శాతం అభ్యర్థులు హాజరు.
(J. Surender Kumar)
జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాలలో. ఆదివారం జరిగిన గ్రూప్ -1 పరీక్షలలో మొత్తం 6885 మంది అభ్యర్థులకు గాను 5552 మంది.

( 80.64 శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 1333 మంది ఆబ్సెంట్ అయినట్లు కలెక్టర్ వివరించారు.
పసిరికల మందు దుకాణం పై కేసు నమోదు!

రాయికల్ మం. రామాజీపేట గ్రామంలో ఆయుష్ శాఖ వరంగల్ రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో పసిరికల మందు దుకాణాలలో తనిఖీలు., అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పసిరికల మందు కేంద్రాలపై కేసులు నమోదు చేసి మందులు సీజ్ చేసిన అధికారులు.
అభినందన కార్యక్రమం!

ధర్మపురి పట్టణం ముస్లిం కమిటీ వెల్ఫేర్ .అధ్యక్షులుగా ఎన్నికైన ఖాజా అజ్మత్ అలీ, (ఓ.కె.స్టోర్), మహేంద్ర సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చిలువేరి లక్ష్మినర్సయ్య, మరియు అదేవిధంగా మహేంద్ర సంఘం ధర్మపురి పట్టణ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన పిల్లి సత్యనారాయణ ను 1988-89 ఎస్.ఎస్.సి మిత్రబృందం ఆదివారం స్థానిక ఆంగ్లోవేదిక్ పాఠశాల లో అభినందన కార్యక్రమం ఏర్పాటుచేసి వారిని.ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మిత్రబృందం సభ్యులు,. స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ తదితరులు పాల్గొన్నారు.
