@ చుండూరు సభలో..
( J.Surender Kumar )
టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ చుండూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో. బిజెపి పార్టీని ప్రధాని నరేంద్ర మోడీని తన మాటల తుటాలతో తూర్పార పట్టారు.
కెసిఆర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు
మునుగోడులో అవసరం లేకుండా వచ్చిన ఉప ఎన్నిక జరుగుతుంది
ఉప ఎన్నిక ఫలితం కూడా నాకు ముందే తెలుసు
న్యాయం ధర్మం అంతా మునుగోడు ప్రజలకు తెలుసు
నాలుగు ముఖ్యమైన విషయాలు చెబుదాం అని మీ ముందుకు వచ్చాను
ఉప ఎన్నికలు అనేవి పలు రకాల పరిస్థితుల వల్ల వస్తుంటాయి… రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు… కానీ జనం అనే వాళ్ళు మారకూడదు
ఓటు అనేది మన తలరాతను మార్చే గొప్ప ఆయుధం…

దేశ తలరాతను మార్చు గొప్ప ఆయుధం
ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి…
నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు వచ్చారు
ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని 100 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు, వాళ్లని ఎడమకాలు చెప్పుతో కొట్టారు ఈ నలుగురు తెలంగాణ బిడ్డలు
ఇటువంటి దమ్మున్న నలుగురు రాజకీయాల్లో కావాల్సింది
100 కోట్ల రూపాయలను కూడా గడ్డి పోచతో తో తీసి పడేసారు
ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుకొని ప్రభుత్వాన్ని కొలుస్తున్నారు
దేశంలో మోడీని అడుగుతున్న… మోడీకి ప్రధాని మంత్రి కంటే ఇంకా ఏం పదవి కావాలి…?
ఆర్ఎస్ఎస్ కు సంబంధాలు ఉన్నవాళ్లు ఢిల్లీ నుంచి వచ్చి నేడు చంచల్గూడా జైల్లో ఉన్నారు
ఈ కుట్ర వెనక ఉన్న వాళ్ళు ఒక్కరూ కూడా వదిలిపెట్టను..పదవులు ఉండటానికి అర్హులు కాదు..
గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పితికితే పాలు రావు… అలానే ఓటర్లు కూడా ఆలోచన చేసి ఓటు వేయాలి
చేనేత రంగంపై జీఎస్టీ 5% విధించిన దుర్మార్గుడు మోడీ
తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు
జీఎస్టీ విధించి చేనేత రంగాన్ని నడ్డి విరుస్తున్నారు.,..
సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారంట.. ఇళ్లల్లో మీటర్లు లో కూడా 30,000 కట్టి , మీటర్లు కొత్తవి బిగించాలి
నా బంధువులు నా బలం తెలంగాణ ప్రజలే
20 – 30 మంది ఎమ్మెల్యేలను కొన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి చూస్తుంది…
బిజెపికి డిపాజిట్లు వస్తే, కేసీఆర్ ను పక్కకు జరుపుతారు …
చూడు చూడు నల్లగొండ- గుండెల పై ఫ్లోరైడ్ బండ అనే పాట నేనే రాశా
హంసలాగా పాలను నీళ్ళని వేరు చేసే శక్తి ప్రజలకు రావాలి
యావత్ తెలంగాణ లాగా దేశాన్ని కూడా మార్చేది టిఆర్ఎస్ పార్టీ.

దేశ రాజకీయాలకు మునుగోడు కంకణం కట్టాలి…శ్రీకారం చుట్టాలి
ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది… తెలంగాణ పచ్చబడితే ఓర్వలేక పోతున్నారు
నేను మహా మొండి వాడిని
మునుగోడు లో తెరాస గెలిస్తే రోడ్లు,హాస్పటల్, కాలేజీలు 15 రోజుల్లో కట్టిస్తా…
గెలిచినవాడు గెలిచి వెళ్ళిపోయాడు ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ మధ్య ఉన్నాడు….
భారతదేశం.. పైన పొటారం లోన లొటారం చందాన ఉంది
మతోన్మాద బిజెపికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి
రూపాయి పతనానికి బాధ్యులు బీజేపీ
ఎక్కడ దాకా అయినా కొట్లాడి మునుగోడుకి మంచినీటి సరఫరా చేయిస్తా
రేపటి బిఆర్ఎస్ విజయానికి పునాది మునుగోడే కావాలి
వడ్లు కొనటం చేతగాని బిజెపి నాయకులకి ఎమ్మెల్యేలు కొనటం చేత అవుతుంది
మోదీ విష గురువా .? విశ్వ గురువా ?
కెసిఆర్ ఉన్నంతవరకు రైతుబంధు ఎవడు ఆపలేరు
కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడటం లేదు…
నిన్న మొన్న టీవీలో చూసింది మీరు చాలా చిన్నది..- రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠం కదల పోతుంది
మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో ఏ రోజు నేను సభ జరుపలేదు,ఏం తప్పు చేశాడని జగదీష్ రెడ్డి నిషేధించారు?
వీటి అన్నిటికీ జవాబు రేపు మూడో తారీకు చెప్పబోతున్నాం
తలమాసినోడు తల బట్టలతో ప్రమాణం చేయమంటే చేయాలా ?
