జగిత్యాల -కరీంనగర్ రోడ్డులో.
( J. Surender Kumar )
జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారిపై గంగాధర వద్ద గల రైల్వే గేట్ No:29/T రైల్వే గేటు వద్ద మంగళవారము నుంచి ( తేది: 11.10.2022 నుండి 18.10.2022) వరకు గేట్ వద్ద స్పీడ్ కోసం ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టనున్నట్టు రైల్వే శాఖ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే గేట్ గుండా కరీంనగర్ కు వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.

వాహనదారులు కొండగట్టు, JNTU ,బైపాస్ రోడ్, మీదుగా
బోయినపల్లి, .వేములవాడ. నుంచి గంగాధర X-రోడ్ గుండ రాకపోకలు కొనసాగించాలని ప్రకటనలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వివరించారు.

ఈ మేరకు జగిత్యాల్ కలెక్టర్ లేక సంఖ్య C1/1216/2022 ద్వారా పోలీస్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ట్రాఫిక్ దారి మళ్లించాలని అందులో పేర్కొన్నారు.