రైతు జన బాంధవుడు రత్నాకర్ రావు’

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

(J. Surender Kumar)
స్వర్గీయ మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు, రైతు జన బాంధవుడు , రైతులు, వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ,ఆయన చిత్తశుద్ధి  ఆలోచన ఆచరణలో పెట్టగలిగితే అదే ఆయనకు మనము ఇచ్చే ఘనమైన జయంతి నివాళులు . అని కొత్త భద్ర లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

జువారి రత్నాకర్ రావు  95వ జయంతి వేడుకలు మంగళవారం ధర్మపురి పట్టణంలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీల అతీతంగా  పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానే  నివాళులు అర్పించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  జువ్వడి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ,   రత్నాకర్ రావు తో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, హయాంలో వారితో కలిసి మంత్రి గా పదవి బాధ్యతలు నిర్వహించే అవకాశం నాకు వచ్చింది అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారితో  కృషి చేశానన్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా నే కాకుండా,  రాష్ట్రవ్యాప్తంగా రత్నాకర్ రావు,అంటే వ్యవసాయం, రైతులు, రైతు కార్మికులు అనే టాక్ రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ యంత్రాంగంలో  ఉందన్నారు.

ADVERTISEMENT


రైతుల అభివృద్ధి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు పొందుతారు, వంటి ఎప్పుడు రైతుల గురించి ఆలోచించే గొప్ప నాయకులు రత్నాకర్ రావు. రైతుల పట్ల ,మిల్లర్ల దోపిడీ గురించి చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన రత్నాకర్ రావును, నన్ను,  అప్పుడు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సత్యనారాయణ గౌడ్ ల ను అక్రమంగా అరెస్టు చేసిన సంఘటనను ఆయన గుర్తు చేశారు.  పెద్దమనిషి , భౌతికంగ మన మధ్య లేనప్పటికీ వారి ఆలోచన విధానం, మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు..
రాజుల చెరువును, రోడ్ల వాగు రిజర్వాయర్ గా!
రాజుల చెరువును ఎస్సారెస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మార్చిన. ఘనత రత్నాకర్ రావుది అనే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీర్పూర్, ధర్మపురి మండలాలలో 15 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. సాగు తాగునీటి కోసం జువాడి కృషి చరిత్ర పుటలలో నిలిచిపోతుందని, జీవన్ రెడ్డి అన్నారు..


కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రత్నాకర్ రావ్ కుమారులు, కొరుట్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జి, జువ్వడి నర్సింగరావు, ధర్మపురి దేవస్థాన మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, నియోజకవర్గ వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సంఘనబట్ల దినేష్, శైలేందర్ రెడ్డి,. నాయకులు వేముల రాజేష్, కుంట సుధాకర్, కస్తూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీర్పూర్ మండల కేంద్రంలో..


మండల కేంద్రమైన బీర్పూర్ లో మంగళవారం మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

తెరాస ఆధ్వర్యంలో..

ధర్మపురి కేంద్రంలోని జువ్వడి రత్నాకర్ రావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా జయంతి నివాళులు అర్పించారు.

.