సర్పంచ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.!


( J Surender Kumar)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం ప్రజా ప్రతినిధుల ప్రాణాలు తీస్తుంది.. అభివృద్ధి పనులు చేసిన నిధులు మంజూరు కాక సర్పంచులు అప్పుల పాలవుతున్నారు.. సకాలంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో చేసిన అప్పు రెట్టింపు అవుతుంది.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నరని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.


ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ గ్రామ సర్పంచ్ సంతోష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతోనే చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక సర్పంచ్ సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఎమ్మెల్సీ నిధుల కోట నుండి 5 లక్షల మంజూరు చేస్తా మని వారికి హామీ ఇచ్చాడు. వ్యక్తిగతంగా సర్పంచ్ కుటుంబానికి ₹ 20,000 ఆర్థిక సహాయం ఆనందించారు..చిన్న గ్రామ పంచాయతీల ఆదాయానికి మించి ట్రాక్టర్లు చేయించడంతో గ్రామపంచాయతీలు కనీసం వాయిదాలు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాయని అన్నారు.