(J.Surender Kumar)
జగిత్యాల పట్టణములో సర్దార్ సత్రం లో ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఎమ్మేల్యే సంజయ్ ఉచిత సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించి, రోగులకు మందులు పంపిణీ చేశారు.,

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి ఎక్కడెక్కడో స్థిర పడ్డ వైశ్య వర్గానికి చెందిన వైద్యులు ఈ రోజు రావడం చాలా ఆనందదాయకం అని అన్నారు.అధికార పార్టీ అంటే అధికారం చెలాయించడం కాదని సేవ చేయడమే అని ముఖ్యమంత్రి గారు పలు మార్లు ఆన్నారని అన్నారు,

సేవా చేయటం ద్వారానే ప్రజల్లో గుర్తింపు వస్తుంది .. సండే పర్ సర్వీస్ అనే నినాదం ద్వారా ప్రతి ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయటం జరుగుతుందని అన్నారు, వైశ్య సంఘ సభ్యులతో చిన్న నాటి నుండి అనుబందం ఉన్నదని గుర్తు చేసుకున్నారు. అన్ని వేళలా అండగా ఉంటామని, జగిత్యాల పట్టణ అభివృద్ధి కి అందరూ కలిసి కృషి చేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, పట్టణ వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేశ్, అధ్యక్షులు మంచాల కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,కౌన్సిలర్ లు బొడ్ల జగదీష్,కప్పల శ్రీకాంత్,జిల్లా రైతు బంధు సమితి సభ్యులు దామోదర్ రావు, వివిధ విభాగాల వైద్యులు,వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ!

పెగడపల్లి మండల ZPTC రాజేందర్ రావు బావ బోయిన్ పల్లి మండల స్తంభం పల్లి గ్రామానికి చెందిన చెన్నాడి రవీందర్ రావు మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్. పరామర్శించారు.

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో జెడ్పిటిసి నాగం భూమయ్య కూతురు వస్మిత ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , జగిత్యాల జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ హారి చరణ్ రావు, జెడ్పీటీసీ సభ్యులు అశ్వినీ, సుధారాణి ఎంపీపీ రేవతి, వైస్ ఎంపీపీ కిరణ్ రావు కో ఆప్షన్ రఫీ మండల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు. పరామర్శించారు.
