శ్రీ యమధర్మరాజుకు విశేష పూజలు!

ధర్మపురి ఆలయంలో

(J.Surender Kumar)
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు దేవాలయం లో గురువారం స్వామివారికి. రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం ,హరతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.


దీపావళి పండగ రెండో రోజున యమ ద్వితీయ భగినీ హస్త భోజనం . జరుపుకుంటారు. భారతదేశంతో పాటు, నేపాల్‌లో కూడా జరుపుకొంటారు.

ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది.


పురాణ గాధ
సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు యమధర్మరాజు, యమున చెల్లెలికి అన్న పైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు

. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి, ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికను యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.యమునకు, యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే, యమ ద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనం గా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది.
యమ ధర్మరాజు ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమం లో వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ , అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్,బొజ్జ సంతోష్ కుమార్ ,బొజ్జ సంపత్ కుమార్ , బొజ్జ రాజగోపాల్,ప్రదీప్ కుమార్ , నేరెళ్ల విజయ్ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు గునిశెట్టి రవీందర్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు , వేముల నరేష్ , గందె పద్మ , మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా గోదావరి హారతి!


కార్తీకమాసం సందర్భంగా గోదావరి హారతి లొ బాగంగ రెండవ రోజు స్థానిక మహిళలలచే కోలాట నృత్యాలతో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలతో గోదావరి నదివరకు వచ్చి విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ దీపాలు సమర్పించడం జరిగింది.