షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఎమ్మెల్యే ఉరివేసుకున్నడా?

TYSR పార్టీ అధ్యక్షురాలు షర్మిల!


( J. Surender Kumar )
కోరుట్ల మండలంలో శుక్రవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలో బుల్లెట్ పాయింట్స్ ఇలా ఉన్నాయి

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించక పోతే విద్యా సాగర్ రావు ఉరి వేసుకుంటా అన్నాడట కదా
చెప్పి ఓట్లు వేయించుకున్నాడట కదా
షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు…ఉరి వేసుకున్నాడ..?
ఇచ్చిన మాట మీద నిలబడలేని మీ ఎమ్మెల్యే కి సిగ్గుండాలి కదా
దమ్ముంటే విద్యాసాగర్ రావు మాట నిలబెట్టుకోవాలి
ఈ నియోజక వర్గ ఎంపీ ఏమో ఆస్తులు అమ్ముత అన్నాడట
ఈ నియోజక వర్గానికి ఒక చేతగాని ఎమ్మెల్యే,చేతగాని ఎంపీ
వైఎస్సార్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ లను తెరవాలి అనుకున్నారు
వైఎస్సార్ హయాంలో పసుపు పచ్చ బంగారం అయ్యింది
బంగారం తో పోటీ పడి 22 వేల దాకా మద్దతు ధర పలికింది
ఇప్పుడు మీ ప్రభుత్వం పసుపుకు ఇస్తున్నది ఎంత ముష్టి 6 వేలు
పాలన అంటే వైఎస్సార్ ది రుణమాఫీ దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వరకు ప్రతి పథకం అద్భుతంగా అమలు చేసి చూపించారు
వైఎస్సార్ 5 ఏళ్లు అంత చేస్తే 8 ఏళ్లుగా కేసీఅర్ చేసింది మోసమే కదా
కేసీఅర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు
సున్నా వడ్డీకి రుణాలు అని మోసం
ఆత్మగౌరవం ఇల్లు అని మోసం
మూడు ఎకరాల భూమి అని మోసం..పోడు పట్టాలు అని మోసం
మొత్తం మంచి సినిమా చూపించారు

కోరుట్ల మండలం రాజాపూర్ గ్రామంలో స్వల్ప తోపులాట.


ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు
5 వేలు రైతు బందు ఇచ్చి కోటీశ్వరులు చేశా అని చెప్తున్నారు
రుణమాఫీ కాక ఇచ్చే రైతు బందు బ్యాంకుల్లో వడ్డీలకు చాలడం లేదు
తెలంగాణ లో రైతులు కోటేశ్వర్లు అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు
కేసీఅర్ ఒక సన్నాసి ముఖ్యమంత్రి
వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి
కేసీఅర్ పాలనలో 8 ఏళ్లుగా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
బంగారు తెలంగాణ లో రైతుకు విలువ లేదు
రైతు ప్రాణాలు అంటే అసలు లెక్కే లేదు.
ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపు లేదు
ఉద్యమంలో చందమామలు అంటూ ముసలి కనీరు కార్చారు
8 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
8 ఏళ్ల తర్వాత 80 వేల ఉద్యోగాలు అని చెప్పి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చారు
ఒక్కో ఉద్యోగానికి 800 మంది పోటీ ఉన్నారు
డిగ్రీ లు, పీజిలు చదివి రోడ్ల పై తిరుగుతున్నారు
కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్ ఇవ్వడం చేతకాదు
కేసీఅర్ కి అసలు పరిపాలన చేతకాదు
బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ..బీర్లు తెలంగాణ గా చేశారు
బంగారు తెలంగాణ లిక్కర్ లో బాగా అభివృద్ధి చెందింది*
ఎక్కడ చూసినా లిక్కర్
రాష్ట్రం ఏర్పడే నాటికి 10 వేల కోట్ల అమ్మకాలను 40 వేల కోట్లకు పెంచారు
YSR హయాంలో పసుపు కి మద్దతు ధర 16 వేలు ఉండేది
ఇప్పుడు క్వింటకు 6 వేలు కూడా ఇవ్వడం లేదు కదా*
ఇలా ఉంటది కేసీఅర్ పాలన
కేసీఅర్ ఎన్నికలు వస్తేనే బయటకు వస్తాడు
ఓట్లు వేయించుకొని మళ్ళీ ఫామ్ హౌజ్ కి వెళ్తాడు
ఈ సారి మళ్ళీ వస్తాడు… కొత్త కొత్త హామీలు ఇస్తాడు
ఈ సారి కేసీఅర్ ను నమ్మితే మీ బిడ్డలు మిమ్మలిని క్షమించరు
8 ఏళ్లుగా ప్రాజెక్ట్ ల పేరు చెప్పి లక్ష కోట్లు కాజేశారు
ఇంత జరుగుతున్నా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఏనాడు కేసీఅర్ ను పట్టించుకోలేదు
కేసీఅర్ ఆగడాలను ప్రశ్నించలేదు
కేసీఅర్ ఆడింది ఆట..పడింది పాట
తెలంగాణ లో అసలు సమస్యలు లేవని బుకాయిస్తున్నరు
ప్రజలు సుభిక్షంగా బ్రతుకుతున్నారు అని పాలకులు అబద్ధాలు చెప్తున్నారు
ప్రజలకు సమస్యలు ఉన్నాయని పాదయాత్ర లో తెలుసుకుంటున్న
ఎక్కడ చూసినా ప్రజల గొసలే
ప్రభుత్వ పథకాలు అందినయి అని చెప్పిన గ్రామమే లేదు
. ఏ ఒక్కరూ నాకు ఈ ప్రభుత్వంలో లాభం జరిగింది అని చెప్పిన వారు లేరు
అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టా
వైఎస్సార్ పాలన ను తిరిగి తీసుకు వస్తా
YSR ప్రతి పథకాన్ని అమలు చేస్తా