టార్గెట్  పోలీస్ అధికారులే…

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా.


( J Surender Kumar)
పీపుల్స్ వార్ , మావోయిస్టు పార్టీగా, రూపాంతరం చెందినప్పటికీ, మూడున్నర దశాబ్దాల క్రితమే, తమ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి, ప్రయత్నించిన వారిని టార్గెట్ చేయడం, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను, పోలీసు అధికారులను, హతమార్చడం కోసం,  మందుపాతరలు పేల్చి, సామూహిక  శత్రు సంహారంకు పీపుల్స్ వార్ శ్రీకారం చుట్టి, ప్రతీకార హత్యల పరంపర కొనసాగించింది
వివరాల్లోకి వెళితే.


నక్సలైట్లకు నక్సలైట్ నాయకులకు,  వారి ఉద్యమ బలోపేతం కు అడ్డుపడుతు, కొరకరాని కొయ్యగా ఉన్న. నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లు గా చర్చలో ఉండే నాటి  పోలీసు అధికారులు  నర్సింగరావు,  వేణుగోపాలకృష్ణ,  రమేష్ బాబు, వేణుగోపాలరావు, సుదర్శన్, హబీబ్ ఖాన్, జగన్మోహన్ రెడ్డి,  తదితర అధికారులే టార్గెట్గా నక్సల్స్  ఆధునిక టెక్నాలజీలతో  దాడులకు ప్రయత్నించినా, ఈ దాడులను విఫలం చేయడంలో,  వారు టార్గెట్ చేసుకున్న అధికారులు, సఫలమయ్యారు అని చెప్పవచ్చు.  పోలీస్ అధికారులను మట్టు పెట్టేందుకు రాష్ట్రంలో మొదటిసారి పేల్చిన మందు పాతర. గురితప్పి 14 మంది అమాయకులను బలి తీసుకోంది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న నక్సలైట్, మరాఠీ నరసయ్యను 1990. మేలో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటరాగేషన్లో తమ టార్గెట్ పోలీస్ అధికారులు అని, తాము మందు పాతారలు అమరుస్తుండగా, అప్పటి సారంగాపూర్ ఎస్సై హమీద్ మరో కానిస్టేబుల్, తమ కిల్లింగ్ రేంజ్ పరిధిలో. అందుబాటులో ఉన్న , పట్టించుకోలేదని నక్సలైట్ నరసయ్య  వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.
నక్సలైట్ల సమాచార సేకరణకు. నాడు సెల్ ఫోన్లు, ఆధునిక  టెక్నాలజీ అందుబాటులో లేదు, గ్రామ ,గ్రామాన ,ఇన్ఫార్మర్ వ్యవస్థ, ప్రజలతో స్నేహ సంబంధాలు, కొనసాగిస్తూ,  వారి కార్యకలాపాలను అడ్డుకోవడంలో పోలీసులు సఫలమయ్యారని చెప్పవచ్చు. పోలీస్ స్టేషన్లలో రాజకీయ పైరవీలు, అధికార, అనధికార పార్టీ రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, జోక్యం పైరవీలను ,నాటి పోలీస్ అధికారులు సున్నితంగా తిరస్కరించేవారు. .హోంగార్డు, మొదలుకొని కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులను, పోలీస్ ఉన్నతాధికారులు ప్రేమాభిమానాలతో తమ కుటుంబ సభ్యులుగా గౌరవించేవారు…
నక్సలైట్ లక్ష్మి నరసయ్యను వెంటాడి వేటాడి


తమ కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన  నక్సలైట్ తుమ్మ లక్ష్మీ నరసయ్యను, పట్టుకోవడానికి. కొందరు పోలీసులు, అధికారులు సంవత్సర కాలం పాటు అతని కదలికలపై మాటువేసి 1986 ఆగస్టులో బట్ట పల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు.. లక్ష్మీ నరసయ్య మృతదేహం తరలిస్తుండగా, ధర్మపురిలో కానిస్టేబుల్ ను. హతమార్చిన స్థలంలో. నక్సలైట్ మృతదేహాన్ని ఉంచి కోమల్ రెడ్డి అమర్ హై అంటూ పోలీసులు నినాదాలు చేసి కోమల్ రెడ్డికి నివాళులర్పించారు.
మరో సంఘటన.


1993  అక్టోబర్ లో ధర్మపురి మండలం నేరెళ్ల బట్ట పల్లి గ్రామాల మధ్య  నక్సలైట్లు  సాయంత్రం మందుపాతారలు పేల్చారు.   కూంబింగ్ నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ లో మృతదేహాలు చేల్లాచెదురుగా దట్టమైన అడవిలో పడిపోయాయి. రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులు , మృతదేహాల కోసం రాత్రి అడవిలోకి వెళ్ళవద్దని  ఆదేశించారు. నాటి జిల్లా ఎస్పీ తుషార్ ఆదిత్య త్రిపాఠి, జగిత్యాలలో పోలీసు అధికారులు పోలీసులతో రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఏదేని ప్రమాదంలో. మన కుటుంబ సభ్యులు, సోదరులు, తల్లిదండ్రులు, బంధువులు, చనిపోతే రాత్రిళ్ళు శవాల కోసం గాలించమా ?  వారిని అలాగే అనాధలుగా అడవిలో వదిలేస్తామా.? అంటూ  పోలీసులలో, మానసిక ఆత్మస్థైర్యాన్ని నింపి, అర్ధరాత్రి జనరేటర్లు ఫ్లడ్ లైట్స్ తో దట్టమైన అడవిలోకి వెళ్లి  కానిస్టేబుల్ మృతదేహాలను గాలించి ,స్వాధీన పరుచుకుని ఉదయానికల్లా  జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు.  ఇదే తరహాలో అనేక సంఘటనలలో  పోలీసులకు ఎనలేని మానసిక ధైర్యం నింపుతూ నక్సలిజంను అడ్డుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హత్యల పరంపర !
ధర్మపురి సంఘటనతో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల పై ప్రత్యేక దాడులకు,  నక్సల్స్ వేట ఆరంభించారు. పెద్దపల్లి డి ఎస్ పిగా పనిచేస్తున్న బుచ్చిరెడ్డి నీ నక్సల్స్ కాల్చి చంపారు. 1989 సెప్టెంబర్ లో పోలీసు అధికారులను హత మార్చడానికి బీర్పూర్ మందుపాతర పేల్చివేత వికటించడంతో 14 మంది అమాయక ప్రజలను మృతి చెందారు. 1991 డిసెంబర్ 19న హుస్నాబాద్ మండలం రామవరం, వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతర లో సిఐ యాదగిరి , ఎస్ ఐ  జాన్ విల్సన్ ,.మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు.  1993 అక్టోబర్ 12 న ధర్మపురి మండలం నేరెళ్ల,  బట్ట పెళ్లి వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబులు, రాజయ్య,  శ్రీనివాస్,  ప్రకాష్ లు మృతిచెందారు. 
1992  సెప్టెంబర్ 2న ముత్తారం మండలం గాజులపల్లి,  వద్ద మందుపాతర పేల్చి సివిల్ పోలీసులు, కాకుండా నక్సల్స్ ఏరివేత కోసం వచ్చిన ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు 9 మంది మృతి చెందారు.

1994 లో ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన పంజాబ్  కమాండోల ను మహదేవ్ పూర్  మండలం లంకల గడ్డ, వద్ద మందుపాతర పేల్చి నక్సల్స్ హతమార్చారు. ఈ సంఘటనలో కమాండెంట్, గురు దీప్ సింగ్ సాయి,  అసిస్టెంట్ కమాండెంట్, సివిల్ ఎస్ ఐ ,వై వెంకటస్వామి, మరో ఐదుగురు మృతి చెందారు. 1999 ఎన్నికలలో రిపోలింగ్ బందోబస్తు కోసం ,వెళుతున్నా  పోలీసు బృందం మహా ముత్తారం మండలం దుబ్బ లపాడు ,వద్ద మందుపాతర పేల్చిన నక్సల్స్ ఆర్.ఎస్.ఐ సంజీవరెడ్డి, తోపాటు మరో ముగ్గురు కానిస్టేబుల్లు హతమయ్యారు.
1998 సెప్టెంబర్ 13న మెట్టు పల్లి మండలం ఆత్మకూరు, లో నక్సల్స్ కాల్పులు జరిపి జగిత్యాల కానిస్టేబుల్ రవీందర్ నాయక్ ను చంపారు. 1990 మార్చి 9న మేడిపల్లి మండలం  ఒడ్డడు, గ్రామంలో నక్సల్ కాల్పుల్లో కానిస్టేబుల్ రాజన్న, కోహెడ మండలం సింగరాయకొండ జాతరాలో కానిస్టేబుల్  ప్రకాష్ సింగ్ ను  కాల్చిచంపారు. 1991 ఫిబ్రవరి 9న. భూషణ రావు పేట, లో జరిగిన ఎదురు కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్  ఫసల్ ఉద్దీన్, కానిస్టేబుల్ , మోహినుద్దీన్  మృతిచెందారు. 1991 సెప్టెంబర్ 10న జగిత్యాల మండలం కల్లెడ, సమీపంలోని కుక్కల గుట్ట వద్ద, నక్సల్స్ పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో  హెడ్ కానిస్టేబుల్, మోబిన్, మృతి చెందాడు.  1993 జూన్ 14న మలహార్ మండలం, ఎడవల్లి, వద్ద అ మందుపాతర పేల్చడంతో ఎస్ఐ, సుభాన్ మృతి చెందాడు. 1993 జూలై 8 న వరంగల్, కరీంనగర్ జిల్లా సరిహద్దు భూపాలపల్లి,సమీప అటవీ మార్గంలో నక్సల్స్  పేల్చిన మందుపాతర లో ఏ ఆర్ ఎస్ ఏ వెంకటాచారి, హెడ్ కానిస్టేబుల్, నాగభూషణం , కానిస్టేబుల్లు  కిషన్ రావు, రవీందర్, దేవయ్య లు మృతి చెందారు. 1994 అక్టోబర్ 28 న నక్సల్స్ జరిపిన కాల్పులు గంభీరావుపేట ఎస్ ఐ, ఎన్ డి సాబీర్ ఖాన్ ,మృతి చెందారు. 2003 ఫిబ్రవరి 11న  కోనరావుపేట మండలం వట్టెంల,  తండాకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన కానిస్టేబుల్స్ నాయక్, కృష్ణ లను,  నక్సల్స్ కాల్చి చంపారు. 2005 అక్టోబర్ 21న. ధర్మపురి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు ప్రతి ఏటా ఇక్కడ విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తుంటారు.
సమిదలైన సాయుధ పోలీసులు, కకావికలమైన కుటుంబాలు !


 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ ఉద్యమాన్ని  ఉక్కు పాదంతో . అంతం చేయుటకు.  సాయుధ పోలీసులు పోలీసులు,పోలీస్ అధికారులు, నక్సల్స్ మారణ హోమంలో సమిధులయ్యారు. వారి కుటుంబాలు  ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కకావికలమైన, కుటుంబాలు ఎన్నో, ఎన్నెన్నో, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం. తమ అమూల్య ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేసిన పోలీసులు తమ కుటుంబాలను అనాధలుగా వీధిన పడవేసి కానరాని లోకాల్లో వారు కలిసిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో నక్సల్స్..దళాలతో, పోలీసు బలగాలు. అమీ ,తుమీగా రాజి లేని పోరాటం చేశారని చెప్పవచ్చు, ఎత్తులకు పై ఎత్తులు, దాడులకు ప్రతి దాడులు చేస్తూ, మందు పాత్రలో మారణ హోమంలో, తుపాకీ తుటాలకు ఎదురొడ్డి, ప్రాణాలను బలిదానం చేస్తూ పోలీసులు ప్రశాంత వాతావరణం కోసం,చేసిన .ఎనలేని కృషి, ప్రాణ త్యాగాలు చరిత్ర ఫోటోలలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం  ఉంది
భయం భయంగా పోలీసుల బ్రతుకులు!


దాదాపు.1985 నుడి రెండున్నర దశాబ్దాల కాలం పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పోలీసులు, వారి కుటుంబాలు భయం భయంగా జీవనం కొనసాగించాల్సిన దుస్థితి ఉండేది. అనుక్షణం మృత్యు భయంతో, భయం భయంగా వారు వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. వారి భార్య పిల్లలు బిక్కుబిక్కుమంటూ దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా. అనుక్షణం ఆందోళనలతో జీవనం కొనసాగించాల్సి పరిస్థితి నాటిది. పిల్లల విద్యాభ్యాసము,ఏ ప్రాంతం, పట్టణం, ఏ పాఠశాల, హాస్టల్  తదితర వివరాలు కానిస్టేబుల్ బంధువులకు కూడా తెలిసేవి కావు. నక్సస్ టార్గెట్ లో ఉన్న కొందరు పోలీసులు కుటుంబాలు ఇతర రాష్ట్రాల నివాసం ఏర్పాటు చేసుకునేవారు. ఎలాంటి వసతి సౌకర్యాలు లేకున్నా పోలీస్ స్టేషన్ ఆవరణలో గల క్వార్టర్స్ లోనే  ఉండేవారు. అక్కడ భద్రతాభావంతో పోలీస్ స్టేషన్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. ఫ్లడ్ లైట్స్  వెలుతురు, రాత్రి 7 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు. పోలీస్ స్టేషన్ ముందు రాకపోకల నిషేధం. బారికెట్ల ఏర్పాటు, పోలీస్ స్టేషన్ కు ఎవరు వచ్చిన గేటు ముందు నిల్చండి, దూరంలో  కాపలా సెంట్రి అనుమతితోనే లోనికి రావాల్సిందే. పండుగలు పబ్బాలకు వెళ్లేవారు కాదు. అడవుల్లో గ్రామాల్లో కూంబింగ్ కు వెళ్లిన పోలీస్ బృందంలో కనీసం 25 మంది. సాయుధ పోలీసులు ఉండేవారు. జీవులు వాహనాలు ద్విచక్ర వాహనాలు వినియోగించేవారు కాదు. ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్లు అయినా కాలినడకన వెళ్లక తప్పని దుస్థితి నాడు.