తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, ఆవిష్కరణలకు నిలయం -మంత్రి కొప్పుల

(J. Surender Kumar)
119.5 కోట్లతో ఆర్.ఓ.బీ, 1.5 కోట్ల తో 4 లైన్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
రూ1.8 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రారంభం


పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి.దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి నిలుస్తుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.


సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి పెద్దపల్లి పట్టణ కేంద్రంలో పర్యటించి 119.5 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పెద్దపల్లి – కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు, 1.52 కోట్ల రూపాయలతో కమాన్ నుండి సుభాష్ బొమ్మ వరకు నిర్మించనున్న నాలుగు లైన్ ల రహదారి పనులకు శంకుస్థాపనలు, 1.80 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి అతిధి గృహాన్ని ప్రారంభించారు.


శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లు వి. లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డిసిపి రూపెష్, ఈఈ ఆర్ అండ్ బీ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.