పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా .
( J.Surender Kumar )
నక్సల్స్ ఆగడాలను అరికట్టడం, ప్రభుత్వ ఆశయ సాధన కోసం ప్రాణాలు, లెక్కచేయకుండా విధి నిర్వహణలో నక్సల్స్ చేతిలో హతమైన పోలీసులలోA.R కానిస్టేబుల్ No. 1072 కోమల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి పోలీస్ అమరవీరుడు.

పీపుల్స్ వార్ నక్సల్స్ తొలి సారిగా పోలీసులను వర్గ శత్రువులుగా, ప్రకటిస్తూ వారిని హతమార్చడమే లక్ష్యంగా 37 సంవత్సరాల క్రితమే పోలీస్ హత్యలకు శ్రీకారం చుట్టింది. ధర్మపురి పట్టణంలోనే.
భారతదేశంలో అక్టోబర్ 21. రోజును పోలీస్ సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించి వీరమానం పొందిన పోలీసులను స్మరించుకోవడానికి సన్మానించుకోవడానికి ఈరోజు ప్రత్యేకత. 1959 లడక్ ప్రాంతంలో భారత సైనికులు 20 మందిపై చైనా సైనికులు దాడి చేసి పదిమందిని చంపి ఏడుగురిని ఖైదీలను చేయబడిన రోజును జ్ఞాపకంగా ప్రభుత్వం పోలీస్ అమరవీరుల దినోత్సవంగా నిర్వహించుకోవడం అనవాయతీగా వస్తున్నది.
పీపుల్స్ వార్ వర్గ శత్రు నిర్మూలనకు శ్రీకారం!
కానిస్టేబుల్ కోమల్ రెడ్డి కాల్చివేత !

తనను వెంటాడి, తన స్నేహితుడిని ఎన్కౌంటర్లో కాల్చిచంపిన పోలీసులను, వార్ నక్సల్స్ వర్గ శత్రు నిర్మూలనకు పథకం కు శ్రీకారం చుట్టింది ధర్మపురిలో. తమను వెంటాడిన పోలీసుల, కదలికలపై కొన్ని రోజుల పాటు, పట్టణంలో రెక్కీ నిర్వహించిన నక్సలైట్, తుమ్మ లక్ష నరసయ్య, తనతో పాటు మరో నక్సలైట్, ఖదీర్ ను వెంటబెట్టుకొని బస్టాండ్ లో ( గతంలో బస్సులను నిలిచిన చోటు ) సాయంత్రం వేళ ఓ హోటల్ లో గోదావరి స్నానానికి వచ్చిన భక్తులవలె, టీ తాగుతూ తమ టార్గెట్ కోసం ఇద్దరు నక్సలైట్లు దాడికి వేచి ఉన్నారు. 1985, జూలై 23 న తనను వెంటాడిన ఇద్దరు కానిస్టేబుల్స్ కోసం 1985 జూలై 23న, ఎదురు చూస్తున్నారు. ( పక్కనే ఓ పాన్ డబ్బా ఉంది, పాన్ డబ్బా వద్ద కానిస్టేబుల్ కోమల్ రెడ్డి పాన్ తీసుకుంటున్నాడు, టీవీఎస్ వాహనంపై పాన్ డబ్బా వద్దకు వచ్చి వాహనం పై నే ఉండి పాన్ కట్టించుకున్నాడు) నక్సలైట్లు తుమ్మ లక్ష్మీనరసయ్య , ఖదీర్, కానిస్టేబుల్ కోమటిరెడ్డికి, ఎదురుగా వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కోమల్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు. కోమల్ రెడ్డి రక్తాన్ని ,చేతుల్లో తీసుకుని గాల్లోకి ఎగరేసి, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ, అతడి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసుకొని గోదావరి వైపు ఇద్దరు నక్సలైట్లు పరుగులు తీశారు.
కాల్పులు జరుపుతున్న సమయంలో పాన్ డబ్బా నిర్వాహకుడి, బుల్లెట్లు గాయాలు తగిలాయి. కొందరు యువకులు, నక్సలైట్ల వెంట పడి పట్టుకోవడానికి పరిగెత్తారు. మమ్మల్ని పట్టుకోవద్దు, అంటూ సాయిబాబా సినిమా టాకీస్, వద్ద నేలపై రెండు, మూడు, రౌండ్లు. నక్సల్స్ కాల్పులు జరిపారు, రాళ్ళకు బుల్లెట్లు తగిలి .చిన్న చిన్న రాళ్లు. యువకులకు తగిలి గాయాలయ్యాయి. నక్సలైట్లు చెరువు కట్ట పైనుంచి, కా శెట్టి వాడ కుండా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , గోదావరి నది దాటి ఆదిలాబాద్ జిల్లా వైపు పరుగులు తీసి తప్పించుకున్నారు.
వర్గ శత్రువులనిర్మూలనకు చిన్న నక్కల పేట ఎన్కౌంటర్ కారణంమా?

పీపుల్స్ వార్ పార్టీ, ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న తరుణంలో. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి, జైన గ్రామానికి చెందిన నక్సలైట్ తుమ్మ లక్ష్మీ నరసయ్య , పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ . 1985 మే 25 న చిన్న నక్కల పేట .గ్రామ పరిసరాల్లో, ఓ ఇంటిలో లక్ష్మీ నరసయ్య ఉన్నట్టు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది.. చడీ చప్పుడు కాకుండా పోలీసు బృందం ఆ ఇంటిని చుట్టుముట్టారు. తమ చుట్టూ పోలీస్ వలయం మాటువేసి ఉన్నారు అనే సమాచారం తెలుసుకున్న నక్సలైట్ లక్ష్మి నరసయ్య, కొన్ని గంటల పాటు నిశ్శబ్దంగా ఆ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు లొంగి పొమ్మని పదే పదే లక్ష్మీ నరసయ్యను హెచ్చరించారు. ఈ దశలో లక్ష్మీ నరసయ్య, తెలివిగా తన వద్ద ఉన్న ఆయుధంను, తనతో మాట్లాడడానికి వచ్చిన జైన గ్రామానికి చెందిన గుడ్ల నారాయణ , అనే వ్యక్తికి తుపాకీ అప్పగించి, ‘పోలీసులు చుట్టుముట్టారు, నీవు ఇంటి వెనుక వైపు నుంచి ఈ ఆయుధంతో పారిపో, నేను పోలీసులతో పోరాడుతాను ‘. అంటూ నారాయణను, వెనుక వైపు నుంచి బయటకు పరిగెత్తించాడు. ఆయుధంతో పరుగెడుతున్న, అమాయకుడు నారాయణ ను పోలీసులు నక్సలైట్ అనుకొని అతని చేతిలో ఆయుధం (తుపాకీ ) ఉండటంతో పోలీసులకు అతడే నక్సలైట్, లక్ష్మీ నరసయ్య అనుకొని ( అంత వరకు లక్ష్మీనరసయ్య ఫోటో గాని , కదలిక గాని పోలీసులకు తెలియదు. స్వగ్రామం జైన కానీ కొత్తగూడెంలో విద్యాభ్యాసం చేశాడు) .లొంగి పొమ్మని హెచ్చరించిన వినక పోవడంతో పోలీసుల కాల్పులు నారాయణ మృతి చెందాడు.
ఇంటికి మరోవైపు ద్వారం గుండా లక్ష్మీ నరసయ్య తప్పించుకొని పారిపోతుండగా, స్పెషల్ పార్టీ కి చెందిన ఇద్దరు పోలీసులు కోమల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి లు, నక్సలైట్ లక్ష్మీ నరసయ్యను వెంటాడారు. ఒకరి వెంట ఒకరు పంటచేలలో పరుగులు పెట్టారు. దాదాపు ఐదారు కిలోమీటర్లు దూరం గోదావరి నది, వైపు పరుగులు తీశారు. సాయంత్రం వేళ పశువులు, బర్రెలు ,ఆవులు గ్రామాల్లో కి తిరిగి వస్తున్న సమయంలో ,పశువులమందను అడ్డుపెట్టుకొని గోదావరి నది గుండా నక్సలైట్ లక్ష్మీనరసయ్య తప్పించుకున్నాడు. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో పీపుల్స్ వార్ నాయకత్వం, తమ ఉద్యమానికి ఆటంకాలు కల్పిస్తూ అడ్డు వస్తున్న, పోలీసులను, పోలీస్ అధికారులను, ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులను సైతం వర్గ శత్రువులగా, తీర్మానించుకున్నారు. వారి నిర్మూలనకు శ్రీకారం చుట్టారు.
కొండపల్లి విడుదల కోసం నాడు కానిస్టేబుల్ హత్య !

1984 లో పోలీసు కస్టడీలో ఉండి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యను, తప్పించడానికి ఆయనకు కాపలాగా ఉన్న ముగ్గురు పోలీస్లలో ఇద్దరిని మంచానికి కట్టివేసి, బాత్రూం కి వెళుతున్న కొండపల్లి వెంట కాపలాగా ఉన్న కానిస్టేబుల్ మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ను నక్సల్స్ కాల్చివేశారు.

సీతారామయ్యను 6గురు నక్సల్స్ ఆస్పత్రి నుంచి తప్పించిన సంఘటన ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కానిస్టేబుల్ మొదటి హత్య.
