వరకట్న హత్య కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష  జరిమాన

జడ్జి శ్రీమతి నీలిమ సంచలన తీర్పు!


( J. Surender Kumar)
వరకట్న హత్య కేసులో  నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష  ₹ 1500 రూపాయల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు.


జగిత్యాల పట్టణ  పోలీస్ స్టేషన్ లోని  బ్రాహ్మణవాడ కు చెందిన పుల్ల గంగవ్వ, కూతురు జ్యోతి లక్ష్మినీ, గడ్డం తిరుపతి s/o. గంగమల్లు, 28-సం., తో వివాహం జరుగగా పెళ్లి అయిన కొంత కాలం తరువాత గడ్డం తిరుపతి అదనపు కట్నం కోసం, జ్యోతి లక్ష్మి నీ మానసికంగా, శారీరకంగా వేధించగా. ఈ విషయం పెద్దల వద్ద సమక్షంలో వారి కి మెప్పించి పంపించగా,  ఆ తర్వాత కూడా గడ్డం తిరుపతి ప్రవర్తనలో మార్పు రాక  పోగా జ్యోతి లక్ష్మి నీ రోజు  కొట్టడం, మానసికంగా హింసించడం జరిగింది. 29-05-2017 రోజున,  జ్యోతిలక్ష్మి బాత్‌రూమ్‌లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని కొనగా. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తేది 20-06-2017 రోజున  మృతి చెందింది,
మృతురాలు జ్యోతి లక్ష్మి తల్లి  పుల్లా గంగవ్వ  ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ  పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

కేసు  దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అయిన గడ్డం తిరుపతిని,  కోర్టులో హాజరు పరచడం జరిగింది. కేస్ ను విచారించిన న్యాయమూర్తి   నిందితుని కి 10  సంవత్సరాల జైలుశిక్ష, ₹1500/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ  కేస్ లో పీపీ  శ్రీవాణి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్  కరుణాకర్, బద్రయ్య,  CMS SI రాజు నాయక్ ,  కోర్ట్ కానిస్టేబుల్ శ్రినివాస్ , మరియు CMS  కానిస్టేబుల్  కిరణ్ లు నిందితుదితుడికి శిక్ష పడడం లో కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో  ప్రముఖ పాత్ర వహించగా,  కేస్ లో నిందితుని కి జైలు శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ  సింధుశర్మ అభినందించారు.

అడ్వాన్స్ టెక్నాలజీ కి అనుగుణంగా విధులు నిర్వహించాలి.


జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ !

మారుతున్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ కి అనుగుణంగా అధికారులు, సిబ్బంది,  విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పి  సింధు శర్మ ఐపీఎస్  అన్నారు. శుక్రవారం స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో లో పోలీస్ శాఖ నూతనంగా ఆవిష్కరించిన సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0 కు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ. సిసిటిఎన్ఎస్ నూతనంగా లాంచ్ చేసిన 2.0 అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందని,   సిసిటిఎన్ఎస్  నూతన వర్షన్ 2.0 తో అధికారులు సిబ్బంది,  పని భారం లేకుండా ఉత్సాహంగా విధులు నిర్వహించుకోవచ్చని ఆమె వివరించారు.  సిసిటిఎన్ఎస్ 1.0 తో పోలిస్తే సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0   వాడటం మనదే చాలా ఈజీగా ఉంటుందని దీనిని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు. 

పోలీస్ స్టేషన్లో నమోదయిన అన్ని కేసుల వివరాలు  C.C.T.N.S ( Crime and Criminal Tracking Networks and Systems ) లో అప్లోడ్ చేసి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని  సూచించారు.  ప్రస్తుతం పోలీసు శాఖ లో సాంకేతిక వ్యవస్థ కీలక భాగంగా ఉందని, ఎప్పటికపుడు వివరాలు ఆన్లైన్ లో సరైన విధంగా నమోదు చేస్తూ, మరింత పటిష్టమైన వ్యవస్థ  రూపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి, వృత్తి నైపుణ్యం లో రోజువారీ పురోగతి సాధించాలిని అన్నారు. హెచ్ఆర్ఎంఎస్ మరియు సిసిటిఎన్ఎస్ ఓకే ఫ్లాట్ఫామ్ మీదికి రావడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ విధి నిర్వహణ గురించి రోల్ క్వీరీటీ తెలిసి ఉండాలన్నారు, వర్టికల్ వారిగా విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది వారు చేసే విధులు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.  జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకు, స్టేషన్ రైటర్లకు, టెక్ టీం రైటర్లకు,  విడతలవారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందిని అన్నారు. సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0వర్క్ కు సంబంధించి రైటర్లను సంబంధిత ఎస్సైలు పర్సనల్గా  గైడ్ చేయాలని సూచించారు. 

అనతరం సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0 పనితిరు కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్ సిబ్బంది  అందరికీ వివరించారు.
ఈ   సమావేశంలో  డీఎస్పీలు  ప్రకాష్ , రవీంద్ర రెడ్డి , SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మరియు  సి.ఐ లు  రమణమూర్తి, శ్రీను, కోటేశ్వర్,. కృష్ణకుమార్,  ఎస్.ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.