( J. Surender Kumar )
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో, బుధవారం పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో R I అడ్మిన్ వామనమూర్తి, వివిధ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, పోలీస్ విధులు మరియు పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ,. ఆయుధలు , పోలీస్ స్టేషన్ ఆవరణ, ఎస్హెచ్ఓ రూమ్, స్టేషన్ రైటర్, లాక్ అప్స్, రిసెప్షన్, .ఇన్చార్జి రూమ్, టెక్ టీం రూమ్, తదితర పరిసరాలను, మరియు విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్, ఆన్లైన్లో చూపించి వారు నిర్వహిస్తున్న విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు

. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు రాగానే విచారణ చేసి, ఏ విధంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది, మరియు నిందితులను అరెస్టు చేయడం, కేసు పరిశోధన చేయడం తదితర అంశాల గురించి వివరించడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి, షీ టీమ్ పైన అవగాహన కల్పించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఉపనస్ కార్యక్రమంలో

ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి, మాట్లాడుతూ పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పల్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం,గురించి వివరనిచ్చారు… ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు.
విద్యార్థులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ భాగంగా జిల్లా శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా లోని వివిధ కళాశాలలో, పాఠశాలలో , జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, వివిధ పోలీస్ స్టేషన్ లో వ్యాసరచన పోటీలు కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా:
కేటగిరి-1: 8th class to ఇంటర్ వరకు రోడ్ ప్రమాదాల నివరణలో పౌరుల పాత్ర
కేటగిరి-2: డిగ్రీ సైబర్ క్రైమ్ నివరణలో పోలీసు, పౌరుల పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కార్యక్రమం నిర్వహించారు
పోలీసు అధికారులకు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా:

కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు..పౌరుల మన్నాలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి.
కేటగిరి-2: ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు..సమర్ధవంతమైన పోలీసింగ్ లో మహిళ పోలీస్ ల పాత్ర. అనే అంశల పై వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరిగింది. వ్యాస రచన పోటీలలో పాల్గొని మొదటి మూడు స్థానాలలో వచ్చిన వారికి జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 రోజున బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన ముగ్గురిని స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించనున్నట్టు అధికారులు వివరించారు