విద్యుత్ షాక్ తో రైతు మృతి. ఎమ్మెల్యే సంజయ్ పరామర్శ


(J.Surender Kumar)
జగిత్యాల జిల్లా.బీర్పూర్ మండల తుంగూర్ గ్రామానికి చెందిన రైతు చెట్ పల్లి (ఒడ్డె) చిన్నన్న శనివారం వ్యవసాయ బావి వద్ద ప్రమాద వశాత్తూ కరెంట్ షాక్ తో మృతి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని,.దహన సంస్కారాలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.

వెంట KDCC జిల్లా మెంబర్ ముప్పాల రామ్ చందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోలుముల రమణ,.మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ , ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, సర్పంచ్ ప్రభాకర్, ఎంపీటీసీ సృజన సుషీన్, మండల రైతు బందు సమితి కన్వీనర్ రాజేశం,.మాజీ పాక్స్ వైస్ చైర్మన్ మనోహర్ రావు,.AE శ్రీనివాస్, నాయకులు మ్యాడ మల్లేశం, రమేష్ బాబు, తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


విద్యార్థులను అభినందించిన చొప్పదండి ఎమ్మెల్యే


ఐఐఐటి లొ సీట్లు సాధించిన రుక్మాపూర్ మాడల్ స్కూల్ విద్యార్థులను చొప్పదండి ఎమ్మెల్ రవి శంకర్ అభినందించారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కార్పొరేట్ స్థాయి కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.
మంచి క్రమశిక్షణ, అకింత భావం గల అధ్యాపకులచే విద్యా బోధన ద్వారా గ్రామీణ విద్యార్థులు ప్రతిష్టాత్మక మైన బాసర IIIT లొ సీట్లు సాధించారు అని అన్నారు. 6 మంది విద్యార్థులు. M మైథిలి .K.దివ్య M రేనుశ్రీ K.పుష్ప B.అఖిల .K శ్రీనివాస్ లను ప్రత్యేకంగా అభినందించారు.
తెరాస లో చేరికలు..


బీర్ పూర్ మండల కోల్వాయి,చిన్న కోల్వాయి గ్రామానికి చెందిన
40మంది యువకులు ప్రభుత్వ అబివృద్ధి,సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ స్వాగతించారు.
కెసిఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్.


సీఎం కేసీఆర్ రామాయణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నాడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సందీప్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం కొలువై గ్రామంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాటలలో
👉ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతుబంధు రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
👉జగిత్యాల జిల్లాలో 2777 మంది రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎలాంటి పైరవీ లేకుండా రైతు బీమా అందిందని రాష్ట్రం మొత్తంలో 80 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు బీమా అమలు జరిగిందని అన్నారు,43 లక్షల మందికి ప్రతి సంవత్సరం తంచనుగా ప్రీమియం చెల్లిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ .
👉స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 750 జిల్లాల్లో జగిత్యాలకు రెండవ స్థానం రావడం ముఖ్యమంత్రి పరిపాలన దక్షతకి నిదర్శనం.
👉దేశంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని కూలీల కొరత ఏర్పడి ఇతర రాష్ట్రాల నుండి కూలీలు రావాల్సిన అవసరం పెరిగిందని రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల కూలీలకు ఉపాధి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

advertisement


👉జగిత్యాల కు చెందిన ప్రతిపక్ష నాయకులు గతంలో దళితులకు ఎటువంటి బ్యాంకు లింకేజీ లేకుండా లోన్ ఇవ్వాలని గత ప్రభుత్వాలను కోరారని కానీ దళిత మందు ద్వారా ఎటువంటి బ్యాంకు లింకేజీ లేకుండా దళితులకు నేరుగా 10లక్షలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అలాంటి దళిత బంధును కూడా విమర్శించడం బాధాకరమని అన్నారు.
👉జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అన్నారు
👉సీనియర్ నాయకులు రైతుబంధు ద్వారా రైతు కూలీలకు నష్టమని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు.
👉రైతుబంధు ద్వారా రైతులకు రైతు కూలీలకు ఉపాధి పెరిగిందని ఆర్థికంగా లబ్ది చేకూరుతుందని,వారు వారి కుటుంబ సభ్యులు రైతు బందు ద్వారా లబ్ది పొందుతూ విమర్శ చేయటం తగదని అన్నారు.
👉జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 23 వేల మంది బీడీ కార్మికులకు 1 లక్ష 40వేల పెన్షన్ జమ అయింది.
👉తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందని గతంలో ఉమ్మడి పాలకులు విమర్శించారని నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నమని అన్నారు.
👉130 కోట్లతో రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని,.వచ్చే పంట వరకు పూర్తి చేస్తామని గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు
👉జగిత్యాల నియోజకవర్గం లో 172 చెరువులను పూడిక తీసి కట్ట బాగు చేసుకున్నామని, నేడు రాత్రి సమయంలో రైతు పొలం వద్దకు పోయే అవస్థ తప్పిందని ఎస్సారెస్పీ కాలువ గేట్ వద్ద రైతుల గొడవలు తగ్గాయని అన్నారు.

ధర్మపురి అమ్మవారి ఆలయంలో ప్రసాద్ జీ!


అమ్మవారి ప్రసాదం అందజేసే కార్యక్రమం లో RSS ప్రచారక్ ,సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ పాల్గొన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గల దుర్గ కాళికా లక్ష్మి అమ్మవారుల ఆలయం వ్యవస్థాపకులు ఆలయ పూజారి సంజీవ్ స్వామి జీ గత నవరాత్రులు అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించడం జరిగింది. . శనివారం అమ్మవారి ఆలయంలో, పట్టణంలోని భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేసే కార్యక్రమం సంజీవ్ స్వామీతో కల్సి RSS ప్రచారక్ ,సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్త జనం తరలివచ్చారు.