(J.Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నకు అనుబంధ ఆలయంలోని శ్రీ యమధర్మరాజుకు భరణి. “నక్షత్రంను” పురస్కరించుకుని స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం, హరతి మంత్రపుష్పం, పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

యమపీడా దోష నివారణకై అధిక సంఖ్యలో భక్తులు యమధర్మరాజుకు జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తజనంతో ప్రాంగణం కిక్కిరిసింది. వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ, అర్చకులు వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్, ప్రదీప్ కుమార్ , బొజ్జ రాజగోపాల్, నేరెళ్ల సంతోష్ కుమార్, దేవస్థానం సూపరిండెంట్, దేవల కిరణ్ కుమార్, మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
రేపు సంకటహర చతుర్థి పూజలు!

సంకష్టహర చతుర్థి సందర్భంగా గురువారం ( 13-10-2022 ) ధర్మపురి లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం శ్రీ గణపతి స్వామి మూలవిరాట్ కు వేదమంత్రాలతో గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
