కోఆర్డినేటర్ రామ్ సుధాకర్ రావు !
(J.Surender Kumar)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నదిలో ఈనెల 21న హారతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు గోదావరి హారతి ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్ దామెర రామ్ సుధాకర్ రావు అన్నారు.
శనివారం ధర్మపురి పుణ్యక్షేత్రంలో గోదావరి హారతి ఉత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. హారతి కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బిజెపి పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీరన్న గారి సురేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్, కన్వీనర్లు బల్గూరి సంతోష్ రావు, పిల్లి శ్రీనివాస్, ల పర్యవేక్షణ లో కార్యక్రమం జరుగుతుందని, పాలెపు భరత్ శర్మ ఆధ్వర్యంలో హోమాది పూజా కార్యక్రమాలు ఆరోజు జరుగుతాయని రామ్ సుధాకర్ రావు అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘీ నర్సయ్య, బండారు లక్ష్మణ్, పల్లెర్ల సురేందర్, కస్తూరి రాజన్న, కందాల నరసింహమూర్తి, నల్మాస్ వైకుంఠం, లవన్ కుమార్, పాలెపు బద్రీనాథ్ శర్మ, కస్తూరి శరత్, ఆకుల శ్రీనివాస్ , శ్యామ్ తదితర బిజెపి విషయం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు