ఆధార్ నవీకరణ చేసుకోవాలి కలెక్టర్ G. రవి


( J. Surender Kumar )
జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ G. రవి ఆదేశించారు.

ఈ మేరకు శుక్రవారం కల్లెక్టరేట్లో పోస్టర్లను విడుదల చేసారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు..పది సంవత్సరాల కంటే ముందు ఈ గుర్తింపు కార్డు పొందిన వారంతా యు.ఐ.డి.ఏ.ఐ. ఆదేశాల ప్రకారం సంబంధిత పత్రాలతో ఆధార్ నమోదు కేంద్రాలను సంప్రదించాలన్నారు. .ఈ నవీకరణ ప్రక్రియ కు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని మీసేవ .ఈ- డిస్టిక్ మేనేజర్ మమత ని కలెక్టర్ ఆదేశించారు. .ఈ కార్యకమం లో కల్లెక్టారేట్ పరిపాలన అధికారి రాజేందర్ , టీఎస్ టీఎస్ మేనేజర్ చేతన్ పాల్గొన్నారు
వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్ ,సిమ్ కార్డు తీసుకునేందుకు , రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని కోరారు.