ఆగం.. ఆగం అవుతున్నారు !

మునుగోడు మూడ్.లో అనుచరులు !


( J. Surender Kumar )
మునుగోడు రిజల్ట్ ఎలా ఉంటాయో? అంటూ ఆయా రాజకీయ పార్టీల అనుచరుగణం ఆగం, ఆగం అవుతున్నారు. కొన్ని గంటల్లోనే మునుగోడు ముఖచిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. రాజమౌళి చిత్రం బాహుబలి, పార్ట్ 1, 2 ఎన్ని వేల సినిమా టాకీస్ లో విడుదల అయిందో తెలియదు కానీ, ఆదివారం ఉదయం విడుదల కానున్న మునుగోడు ముఖచిత్రం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, రాష్ట్ర, రాజధానులలో లక్షలాది టీవీల ముందు కోట్లాది మంది ప్రేక్షక ప్రజలు, వీక్షించడానికి పడిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నారనేది మాత్రం నిజం.

47 మంది అభ్యర్థుల భవిష్యత్తు రేపు వెలుగు చూడనున్న, ప్రధానంగా బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు, వారి అనుచరగణం గత మూడు రోజులుగా ఆగం, ఆగం అవుతున్నారు. పోలింగ్ తీరుతేన్నులు, పోలైన ఓట్ల శాతం, కేంద్రాల వారిగా, గ్రామాల వారీగా, సామాజిక వర్గాల వారిగా, వివరాలు సేకరిస్తూ, లెక్కలు వేస్తూ, టెన్షన్, టెన్షన్ గా కూడికలు, తీసివేతలతో, పాటు మేధోమధనం చేస్తున్నారు.

ప్రస్తుతం జరిగిన పోలింగ్ తీరు అర్థం కాక అవస్థలు పడుతున్న మీరు..2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో పోలింగ్ పర్సంటేజ్ లపై గెలిచిన, ఓడిన, అభ్యర్థి ఓట్ల వివరాలు, గణాంకాలు గుణించడం, విశ్లేషించడం విశేషం.
పోలింగ్ కు ముందు 40 వేల మెజార్టీ నుంచి 50 వేల వరకు గెలుపు మాదే, అంటూ ప్రకటించుకున్న ఆయా పార్టీలో అనుచరుగణం, ప్రస్తుతం భారీ మెజార్టీని తగ్గించుకొని, 4 వేల నుంచి 5 వేల లోపు గెలుపు మాత్రం ఖాయమంటూ. మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ మండలంలో మెజార్టీ మాదే, ఈ బూతులో సాలిడ్ మెజార్టీ మాదే,.ఈ గ్రామంలో కొన్ని ఓట్లు మైనస్ అవుతాయి, ఈ మున్సిపాలిటీలో ప్లస్ అవుతాయి, అంటూ తమను తాము తృప్తి పరుచుకుంటూ, గ్రామాల వారిగా బంధుగణం,. వయస్సుల వారిగా ఓట్లు ఏ పార్టీకి అంటూ జోష్యం చెప్పుకుంటూ తమకు తామే సమాధానపరుచుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.


ఇది ఇలా ఉండగా ఎగ్జిట్ పోల్ సర్వేలు. ఆయా పార్టీలకు రానున్న.ఓట్లు శాతం అంటూ. ప్రకటించడంతో అయోమయం చెందుతున్నా అనుచర గణం.. సర్వేలు నిజమవుతాయా ? నెలల తరబడి నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన మాకు తెలుసా ? పోలింగ్ రోజు వచ్చిన సర్వే ఏజెన్సీలకు తెలుసా అంటూ ? తమ పార్టీ మాత్రం కనీసం 500 ఓట్లతో . గెలవడం ఖాయం అంటున్నారు. సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ మొదటిసారి 171 ఓట్ల తో గెలిచాడు. మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన సర్వేలు సఫలం అయిన వాటి గురించి ,.విఫలమైన వాటి గురించి విశ్లేషిస్తూ. విజయం మనదే అంటూ పైకి మాత్రం ఆయా పార్టీల అనుచర గణం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడు ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి!


న‌వంబ‌ర్ 6వ తేదీన ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని అర్జాల‌బావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

21 టేబుల్స్.. 15 రౌండ్లు.
ఓట్ల లెక్కింపున‌కు 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూప‌ర్‌వైజ‌ర్, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్, మైక్రో అబ్జ‌ర్వ‌ర్ ల‌ను నియ‌మించారు. 15 రౌండ్ల‌లో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేష‌న్ల‌లో న‌మోదైన ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మొత్తంగా 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది.
ఉద‌యం 9 గంట‌ల‌కు తొలి రౌండ్ ఫ‌లితం

మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వ‌చ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్లను లెక్కించ‌నున్నారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పూర్తి స్థాయి ఫ‌లితం వెలువ‌డ‌నుంది.

మొద‌ట‌గా చౌటుప్ప‌ల్ మండ‌లం ఓట్ల లెక్కింపు!మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా.. మొదటగా చౌటుప్పల్ మండల ప‌రిధిలో న‌మోదైన‌ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణ పురం, మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండ‌లాల ఓట్ల‌ను వ‌రుస‌గా లెక్చించ‌నున్నారు.

కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త‌

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలతో, సీసీ కెమెరా ల పర్యవేక్షణ లో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.