అంగరంగ వైభవంగా గోదావరి హారతి ఉత్సవం !

ధర్మపురి గోదావరి తీరంలో..

(J.Surender Kumar)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నదిలో. సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా హారతి కార్యక్రమం జరిగింది..

హారతి కార్యక్రమంలో హారతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, బిజెపి పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు దంపతులు, పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీరన్న గారి సురేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వీరగోపాల్,  కోఆర్డినేటర్  రామ్ సుధాకర్ రావు

కన్వీనర్లు  బల్గూరి సంతోష్ రావు, పిల్లి శ్రీనివాస్ ల పర్యవేక్షణ లో కార్యక్రమం జరిగింది.  పాలెపు భరత్ శర్మ ఆధ్వర్యంలో హోమాది పూజా కార్యక్రమాలు జరిగాయి.

భారీ సంఖ్యలో భక్తులు హారతి ఉత్సవాలు తిలకించడానికి తరలివచ్చారు. నిర్వాహకులు వారికి మినరల్ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్ జిల్లా నుంచి విశ్వహిందూ పరిషత్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, హారతి ఉత్సవానికి తరలివచ్చా రు.  ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, వేదమంత్రాలు, సంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, గోదావరి హారతి ఉత్సవ వేదిక పై నిర్వహించడంతో భక్తజనం పరవశించిపోయారు. ఈ కార్యక్రమంలో. నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ కన్నం అంజయ్య,  సంగి నర్సయ్య, బండారు లక్ష్మణ్, పల్లెర్ల సురేందర్, కస్తూరి రాజన్న, కందాల నరసింహమూర్తి, నల్మాస్ వైకుంఠం, లవన్ కుమార్, పాలెపు బద్రీనాథ్ శర్మ, కస్తూరి శరత్, ఆకుల శ్రీనివాస్ , శ్యామ్ తదితర బిజెపి విషయం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

లక్ష్మీ నరసింహుడికి నందగిరి స్వామీజీ ప్రత్యేక పూజలు!

పరబ్రహ్మణ నందగిరి స్వామీజీ, బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు దంపతులు. సోమవారం లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వీరికి స్వామి వారి శేష వస్త్రం ప్రసాదం అందజేసి వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదించారు.