అంగరంగ వైభవంగాకోరుట్లలో కోటి దీపోత్సవం!

( J.Surender Kumar )

కోరుట్ల పట్టణంలోని కళాశాల మైదానంలో. మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.

ఉదయం 8-05 న.లక పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వర్ణణ, రక్ణాబంధనం,.అఖండ దీపస్థాపన,యాగశాల ప్రవేశం, శోడశ స్తంబ ఆరాధన,.అగ్నిప్రతిష్ఠ,.నవగ్రహ యోగిని, వాస్తుక్షేత్రపాలక, సర్వతోభద్ర మండల రచన,చతుర్థోలింగ భద్రమండపస్థాపన, చండీ పారాయణములు, శత చండీయాగ సహిత సుదర్శన హవనము కార్యక్రమాలను నిర్వహించారు.


సాయంత్రం..
బస్టాండ్ రోడ్ లోగల శ్రీ.హనుమాన్ దేవాలయము నుండి కేరళ వాయిద్యాలచే, మహిళల మంగళహారతులతో, విద్యార్థుల కోలాటాలతో, వేదపండితుల మంత్రోచ్ఛారణలలో .హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామి వారిని ఊరేగింపుగా వేదికవద్దకు ఆహ్వానించారు.

సాయంత్రం 6 గం.లకు బ్రాహ్మణ మహిళా సేవా వాహిని వారి ఆద్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము సా.6-30 ని.లకు: శృంగేరి పీఠ ఆస్థాన పౌరాణికులు,

పురాణ ప్రవర, ప్రవచన నిధి బ్రహ్మ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి కార్తీక దీపోత్సవ విశిష్ట పై ప్రవచనం మరియు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతిస్వామి వారికి పూర్ణకుంభ స్వాగతం. పలికారు. సా.8-01ని.లకు:కోటి దీపాల మహా యజ్ఞం ప్రారంభం ప్రారంభం జరిగింది. అనంతరం వేలాది మంది భక్తజనం దీపాలు వెలిగించారు.

విశేష హారతులు,.అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ పేరిణీ నృత్యాలు మరియు వేదపండితుల ఆశీర్వచనం.. తదితర కార్యక్రమాలు జరిగాయి