పి ఎల్ జి వారోత్సవాల కోసం సమావేశం?
శనివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ !
( J. Surender Kumar)
బీజాపూర్ జిల్లా లో ఎన్కౌంటర్ 4 మావోయిస్టులు మృతి!: బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను సాయుధ పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. ఎదురుకార్పుల్లో మావోలకు సంబంధించిన భారీ మొత్తంలో ఆయుధాలను, ఇతర పరికరాలు, సోలార్ సెట్ ను పోలీసులకు దొరికినట్టు సమాచారం. శనివారం సాయంత్రం వరకు కాల్పులు జరిగినట్టు సమాచారం. ఈ సంఘటన జిల్లాలోని మిర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిది.

మావోయిస్టులు బస్తర్‌లో తమ పిఎల్‌జిఎ వారోత్సవాలను సన్నాహ కార్యక్రమాలు నిర్వహణకు సమావేశమైనట్టు పోలీసు బలగాలకు పక్క సమాచారం అందినట్టు తెలిసింది. బస్తర్‌లో ఫోర్స్ కూడా అలర్ట్ మోడ్‌లో ఉంది. పొమ్మర అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారం మేరకు. డిస్టర్బ్ టు రిజర్వ్ గార్డ్, (DRG) స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ (CRP) ఆంటీ నక్సలైట్స్ కార్ ఫోర్స్, పక్కా ప్రణాళిక తో శుక్రవారం రాత్రి సాయుధ పోలీసు బలగాల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినట్టు బస్తా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పి ఆంజనేయ వార్నిష్ ఓ వార్త సంస్థకు తెలిపారు. శనివారం ఉదయం ఎదురు కాల్పులు మొదలైనట్టు బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వైష్ణవ్ .వివరించారు.

డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యుడు) మోహన్ కడ్తి, సుమిత్ర తోపాటు, మట్వారా ఎల్.ఓ.ఎస్ సభ్యుడు రమేష్, పాటు ఇతర మావోయిస్టులు ఉన్నట్లు పోలీస్ ఉన్నతాధికారుల కథనం
.ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి నక్సలైట్ల మృతదేహాలతో పాటు, 303, 315 రైఫిళ్లు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతానికి కాల్పులు నిలిచిపోయాయని. మా జవాన్లు అడవి ప్రాంతాన్ని జల్లడపడుతున్నట్టు పోలీస్ వర్గాలు వివరిస్తున్నారు.
