బుగ్గారం ఎస్సై పై ఎస్పీకి ఫిర్యాదు !

జగిత్యాల ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు !

(J.Surender Kumar)

న్యాయమూర్తి గారి సూచనలతో చట్టబద్దంగా న్యాయపోరాటం కోసం కేసు పత్రాలు కావాలని అడిగితే నాపైననే తప్పుడు కేసులు పెట్టి, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తానని బెదిరింపులకు, భయబ్రాంతులకు గురి చేస్తున్న బుగ్గారం ఎస్సై తీగల అశోక్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు, నా కుటుంబానికి తగు రక్షణ కల్పించాలని ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేశారు.


గౌరవ న్యాయమూర్తి సూచనల మేరకు నాకు అట్టి కేసు కాగితాలతో పాటు నేను చేసిన పలు పిర్యాదుల యొక్క ఎఫ్ ఐ ఆర్ ప్రతులు కూడా అటెస్ట్ చేసి ఇవ్వగలరని బుగ్గారం పోలీస్ స్టేషన్ లో తేది: 26-11-2022 న దరఖాస్తు చేశానన్నారు. నాకు ఎలాంటి పత్రాలు గానీ, దరఖాస్తు ఇచ్చినట్లు రశీదు గానీ ఇవ్వలేదన్నారు.

అంతే కాకుండా బుగ్గారం ఎస్సై తీగల అశోక్ తేది : 27-11-2022 ఆదివారం రాత్రి  సమయం 8-08 గంటలకు 7989136764 నుండి తనకు ఫోన్ చేసి బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురి చేశారన్నారు. నీపై రౌడీ షీట్ కేసు పెడతానని, రేపు ఉదయమే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫోటోలు దిగాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించారన్నారు. నీపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినా నీ పోరాటం ఆపుతాలేవు, మేము తల్చుకుంటే నిన్ను ఏమైనా చేస్తాం, ఇంకా ఎన్ని కేసులైనా పెడుతాం అంటూ తాను చేసిన పిర్యాదులన్నీ వాపస్ తీసుకోవాలని పరోక్షంగా బెదిరింపులు చేశారన్నారు. ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.