చైల్డ్  లైన్ సె  దోస్తీ చైల్డ్ లైన్ 1098 బాలల హక్కుల వారోత్సవాలు..


                                                                                                                                                     . Surender Kumar


జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి,  సోమవారం చైల్డ్ లైన్ 1098 సే దోస్తీ పోస్టర్ ఆవిష్కరించారు. .కలెక్టర్  మాట్లాడుతూ 0 నుండి 18 సం” లోపు బాల బాలికల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాద పూర్వకంగా మెలగాలని,.వారికి గల హక్కులు  వారు అనుభవించే విధంగా చూడాలని వివరించారు..  0 నుండి 18 సం” లోపు బాలబాలికల కు ఎలాంటి సమస్యలు ఉన్న చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 తెలపాలని సూచించడం జరిగింది. 

బాలబాలికలు అందరికీ వారి యొక్క హక్కులు విధులను ఉపయోగించుకుంటూ , ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. 18 సం”లోపు బాలబాలికలకు అందరికీ హక్కులు మరియు విధులు ఉపయోగించుకోవాలని సూచించారు


అదే విధంగా బాలురతో పాటుగా బాలికలు కూడా లక్ష్య సాధనలో ముందస్తు వరుసలో ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి  డా..నరేష్ ,బాలల హక్కుల గురించి వివరించారు.  0 నుండి 18 సం”లోపు బాలబాలికల కు ఎలాంటి సమస్యలు ఉన్న చైల్డ్ లైన్ జాతీయ స్థాయిలో పనిచేయు ఉచిత ఫోన్ నంబర్ 1098 కు తెలియజేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో  జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, మరియు చైల్డ్ లైన్.1098  జిల్లా కో ఆర్డినేటర్ కడారి శ్రావణ్,  చైల్డ్ లైన్ 1098 .మరియు ఐసిపీఎస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.   

సమస్యలను వెంటనే పరిష్కరించాలి  కలెక్టర్ రవి !


ప్రజావాణికి 21 ధరఖాస్తులు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు, అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే  పరిష్కారం చూపాలని  జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన  21 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లతా. మకరంద్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలను  కలెక్టర్  ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్         

                                                                                                                                జగిత్యాల  తారకరామ్ నగర్ లో  అడిషినల్ కలెక్టర్  ( లోకల్ బాడీస్ )  సోమవారం అంగన్వాడి కేంద్రాన్ని. సందర్శించారు  , .ఈ సందర్భంగా  కేంద్రములోని  రికార్డులు, మరియు పిల్లల ఎత్తుల ,బరువుల,   రికార్డులు పరిశీలించారు.    లోప పోషణ ఉన్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు .,అంతేకాకుండా  లోప పోషణ ఉన్న  పిల్లల  ఎత్తులు, స్టాడియో మీటర్ ద్వారా   బరువులను  సాల్టర్ స్కేల్  ద్వారా   పరిశీలించారు ,   లోప పోషణ  కలిగిన    పిల్లల  తల్లి తండ్రులతో   మాట్లాడారు  వారికీ   పిల్లల లోప పోషణ  పై  అవగాహన  కలిపించారు  , మరియు  తల్లి తండ్రులకు  పిల్లల  పోషణ  పట్ల  తీసుకోవాల్సిన  జాగ్రత్తలను  చెప్పారు  

  బాలల  దినోత్సవం  సందర్భంగా   అంగాని  వాడి కేంద్రం  పిల్లలతో  కేక్  కటింగ్  చేసి  పిల్లలకు  శుభాకాంక్షలు తెలిపారు,  బాల అమృతం చే  తయారు చేయబడిన  లడ్డులని పిల్లలకు  పంచి పెట్టారు.  ఈ  కార్యక్రమములో జిల్లా సంక్షేమ  అధికారి, డాక్టర్ నరేష్ , సి డి పి వో వీర లక్ష్మి , సూపర్ వైజర్ జానకి , తదితరులు పాల్గొన్నారు.