( J. Surender Kumar )
జగిత్యాల పట్టణ చింతకుంట చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100% రాయితీ తో బుధవారం ఉచిత చేపపిల్లలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, పంపిణీ చేసారు
.
అనంతరం ,పెద్ద చెరువు,.లింగం చెరువు లో చేప పిల్లలను గంగపుత్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
చింత కుంట మినీ టాంక్ బండ్ అభివృద్ధి కి 3 కోట్ల నిదులు కేటాయించడం జరిగిందని పలు విడుతల్లో మిషన్ కాకతీయ ద్వారా 172 చెరువులు అభివృద్ధి చేసుకున్నాం అని భూగర్భ జలాలు పెరిగి,మత్స్య కార్మికులకు మంచి ఉపాధి అవకాశాలు లభించాయి అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, ఆదర్శంగా అమృత్ సరోవర్, మిషన్ భగీరథ ఆదర్శంగా హర్ ఘర్ హల్ ప్రారంభించాయి…తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలిచింది.
గంగ పుత్రులకు మోపెడ్, వ్యాన్,.జీప్,.లైఫ్ జాకెట్, బోట్ లు అందజేశారు.
సొసైటీ లో కమిటీ మేరకు సభ్యులను పెంచే అవకాశం ప్రభుత్వం కల్పించింది అని అన్నారు…
చింత కుంట మినీ టాంక్ బండ్ వద్ద పార్క్,ఓపెన్ జిమ్,స్మశాన వాటిక,బస్తీ దవాఖాన,
బీట్ బజార్ వద్ద సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.

ప్రతి పక్షాల అసత్య ప్రచారం నమ్మవద్దని, గతానికి ఇప్పటికీ తేడాను అంచనా వేసి చూడాలని ప్రజలను ఈసందర్భంగా కోరారు.. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు బాలే లత శంకర్,పద్మావతి పవన్, మత్స్య సహకార సంఘ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య, జిల్లా మత్స్యశాక అధికారి దామోదర్,
AD శ్రీనివాస్, గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్,
ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,కౌన్సిలర్ లు పాంబాల రామ్ కుమార్,.కుసరి అనిల్, జగదీష్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, బింగీ రాజేశం కూతురు శేకర్, భూమయ్య, కృష్ణ రావు, గంగారాం, వెంకన్న, సంకె మహేష్, ఫాహీం, మోహన్, క్రాంతి, శ్రీనివాస్, రహమాన్, సూరజ్, ప్రవీణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు మనబడి!

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు ఏర్పాటుకు రూపొందించిన. “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని రాయికల్ మండలంలో పలు పనులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రారంభించారు.
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రాయికల్ మండలం రామజిపెట్ ₹1కోటి 9లక్షలు, భూపతిపూర్ ₹ కోటి రూపాయిలతో వివిధ పనుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:-
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతుల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ₹ 7 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నదని, దీనిలో భాగంగా పాఠశాలల్లో అక్కడి విద్యార్థుల సంఖ్యను బట్టి అదనపు తరగతుల నిర్మాణం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయం,నీటి వసతి, పెయింటింగ్, కమాన్, మురుగుదొడ్లు, కిచెన్ షెడ్స్, కాంపౌండ్ వాల్స్, డైనింగ్ హాల్స్, ఫర్నిచర్, ఏర్పాటు. చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశ్విని జాదవ్,ఎంపీపీ సంధ్యారాణి,మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్,
సర్పంచ్ రమాదేవి మోహన్,చంద్రశేకర్ ,ఎంపీటీసీ మహేష్,ఉప సర్పంచ్ హరీష్ రావు ,SMC ఛైర్మెన్ లు వాసరి రవి,రమేష్,ఎంపిడిఓ సంతోష్,.DE.విద్యార్థులు,.గ్రామస్తులు,.తదితరులు పాల్గొన్నారు