( J. Surender Kumar )
ధర్మపురి పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 735 మంది CMRF లబ్ధిదారులకు ₹ 2 కోట్ల 45 లక్షల 65 వేల 4 /- వందల రూపాయల విలువ గల చెక్కులను మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైన టువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు పంపిణీ చేశారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం !

ధర్మపురి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
రైతుల కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, పండించిన పంటలకు గిట్టుబాటుధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ ,
ఎంపీపీ చిట్టి బాబు, AMC .చైర్మన్ అయ్యేరి రాజేష్, రైతు బంధు అధ్యక్షులు, సౌల్ల భీమన్న, AMC వైస్ చైర్మన్ సునిల్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శేఖర్, తదితరులు పాల్గొన్నారు