(J. Surender Kumar)
జగిత్యాల కలెక్టరేట్ లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ.
రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి
అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

. కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు,బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు , సిబ్బంది .వివిధ అధికారులు పాల్గొన్నారు.
2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరిని కొత్త ఓటర్ గా నమోదు చేయించాలి!

తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ – 2023 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ మరియు జగిత్యాల రూలర్ మం. కల్లెడ గ్రామం, బుగ్గారం మండలంలోని చిన్నాపూర్. ధర్మపురి మండలంలోని నేరెళ్ల కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాను, జాబితాలో చేపట్టిన సవరణలు, రిజిస్టర్లను, ఓటర్ నమోదు కై, కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు, మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం లో జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఆర్ ఓ వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా పేరును జాబితా నుండి తొలగించాలని, బి ఎల్ ఓ.లు ఇంటింటికి వెళ్లి జనవరి 1, 202 3 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు.

ఈ విషయంలో మున్సిపాలిటీలో శానిటేషన్ వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదు పై ప్రచారం కల్పించాలని చెప్పారు. అలాగే మున్సిపల్ వార్డు అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఇళ్లిళ్ళు తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ నమోదుకు చేసు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో ఆర్డి ఓ మాధురి, ఎమ్మార్వో లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నూతన కలెక్టర్ సముదాయం లో అదనపు కలెక్టర్ మకరంద ఆకస్మిక పర్యటించి హారిత హరం మొక్కలు పరిశీలించారు., పెరగని మొక్కలు తొలగించి, కొత్త మొక్కల నాటాలని ఆదేశించారు. బై పాస్ రోడ్డు లో గల మీడియన్ ప్లాంట్స్ పరిశీలించి ఇళ్ళ ముందు గల చెత్త తొలగించాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని మోతే గ్రామంలోని గ్రౌండ్ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.