అనుమతి లేకుండా విమానంలోశాటిలైట్ ఫోన్‌తో ప్రయాణం!
FIR ప్రకారం లోవిక్టర్ సెమెనోవ్ శాటిలైట్ ఫోన్‌ను కలిగి ఉన్నట్టు నమోదు!
(పి టి ఐ వార్త కథనం)
( J. Surender Kumar)
సరైన పత్రాలు లేకుండా శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినందుకు రష్యా మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు PTI వార్త సంస్థ కథనం. ముందస్తు అనుమతి లేకుండా విమానాశ్రయాలు, విమానాలలో శాటిలైట్ ఫోన్‌లు అనుమతించబడవు.
విక్టర్ సెమెనోవ్ (64) 1998 నుండి 1999 వరకు రష్యా వ్యవసాయం, ఆహార మంత్రిగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం 4:20 గంటలకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ విమానాశ్రయం లో భద్రతా దళాలు తనిఖీ సమయంలో విమానాశ్రయాలకు రక్షణ కల్పించే CISF ( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది తనిఖీలలో మాస్కోలో నివసిస్తున్న సెమెనోవ్ ఇండిగో విమానంలో ఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు.

అతని వద్ద సాటిలైట్ ఫోన్ ను కలిగి ఉన్నందుకు, ముందస్తు అనుమతి పత్రాలు తనిఖీ అధికారులకు సమర్పించలేకపోయాడు. ఈ మేరకు పోలీసులుఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. అత్యవసర సమయంలో వ్యక్తిగత ఉపయోగం కోసం శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు రష్యా మాజీ మంత్రి వివరించినట్టు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ( PTI ) వార్త సంస్థ పేర్కొంది.