ధర్మపురి గోదావరి తీరంలో అనంత దీపోత్సవం

బుధవారం సాయంత్రం!

(J. Surender Kumar)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నది తీరంలో బుధవారం సాయంత్రం అనంత దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

బుధవారం కార్తీక మాసం అమావాస్య ముగింపు ఉత్సవంను, పురస్కరించుకుని గోదావరి నదిలో గల మంగళిగడ్డ ఘాట్, మెట్లపై ,అనంత దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

హనుమాన్ చాలీసా పారాయణం!

కార్తీక మాసం పురస్కరించుకొని అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో లోకకళ్యాణార్థం మంగళవారం సాయంత్రం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము జరిగింది.
స్థానిక కళాకారులు సంగనభట్ల నరేందర్, స్థానిక మహిళలు, భక్తులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా “మహలింగార్చన”

పురస్కరించుకుని అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోని వేదికపై మంగళవారం సాయంత్రం మహలింగార్చన కార్యక్రమం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరిగింది.
కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , ముత్యాల శర్మ , అర్చకులు ద్యావళ్ల విశ్వనాథం , బొజ్జ రాజగోపాల్ , సాయికుమార్ , స్థానిక వేదపండితులు మధు శంకర్ శర్మ , మధు రామ శర్మ , సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు.