ఒక్కరోజులో ₹ 5 లక్షల ఆదాయం!
( J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. ఆలయం ,శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, గోదావరి నది తీరం భక్తజనంతో కిటకిటలాడింది.

పవిత్ర కార్తీకమాసం తో పాటు వీకెండ్ సెలవు దినం , సంకష్ట పర్వదినం కావడంతో, స్థానిక భక్తులతో పాటు, యాత్రికులతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. గంటల తరబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్య కల్పన కు చర్యలు చేపట్టారు.
“సంకటహర చతుర్థి” సందర్భంగా

శ్రీరామలింగేశ్వరస్వామి వారి దేవస్థానంలో గల గణపతికి, గణపతి ఉపనిషత్తులతో అబిషేకం, హరతి, మంత్రపుష్పం కార్యక్రమాలను, వేదపండితులు పాలెపు ప్రవీణ్ శర్మ , ముత్యాల శర్మ , స్థానిక వేదపండితులు మధు రామశర్మ , అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్, ద్యావళ్ల విశ్వనాథం , ద్యావళ్ల సాయికుమార్, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు
ఒక్కరోజులో ఐదు లక్షల ఆదాయం!
శనివారం ఆలయం కు మొత్తం ₹,5,17,417/-. రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్లు ₹ 2,76,846/ప్రసాదములు ₹ 1,79,780/, అన్నదానం ₹ 60,791/-
వచ్చినట్టు అధికారులు వివరించారు.