ధర్మపురిలో భక్తజన ప్రభంజనం!

కిక్కిరిసిన గోదావరి తీరం ఆలయ ప్రాంగణం !

( J. Surender Kumar )

ధర్మపురి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన ప్రభంజనంతో పోటెత్తింది. గోదావరి నది తీరం ఆలయ ప్రాంగణంలో భక్తజనం జనసంద్రలా అనిపించింది.

కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో యాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు, సిబ్బంది అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు.

దేవాలయంనకు ఆదివారం ₹ 5,50,264/-రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్లు ద్వారా ₹ 2,98,058/
ప్రసాదాల అమ్మకం ద్వారా ₹ 1,82,200/.అన్నదానం ద్వారా ₹ 70,006/- మొత్తం. ₹ 5,50,264/- లభించినట్టు ఆలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.