ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన!

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

(J.Surender Kumar)

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం పర్యటిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్లను మంత్రి ఈశ్వర్ పరిశీలించారు…
పేద ప్రజలకు విద్యా వైద్య భారం కాకుండదనే ఉద్దేశంతో, తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కాలేజిలతో పాటు, ప్రభుత్వ దవాఖానాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు…
ధర్మపురి నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యవేక్షించారు…
గురువారం మంత్రి హరీష్ రావు గారు హైదరాబాద్ నుండి నేరుగా ధర్మపురి మండల కేంద్రానికి చేరుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 10 పడకల ఐసీయూ కేంద్ర నిర్మాణానికి భూమిని పూజ చేయనున్నారు.


అనంతరం యాభై పడకల ఆసుపత్రి నిర్మాణపు పనులను మంత్రి పరిశీలించి,‌ నూతన డయాలసిస్ కేంద్రం‌ ఆక్సీజన్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించనున్నట్లు మంత్రి ఈశ్వర్ అన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నందిమేడారం లో, 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన అక్కడే ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మంత్రి హరీష్ పాల్గొంటారన్నారు, ఈ సందర్భంగా ధర్మారం మండలం నందిమేడారం లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు… సభ వచ్చేవారికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ నిర్వాహకులకు సూచించారు.