దుబాయ్ లో గుండెపోటుతో కార్మికుడు మృతి !

అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి.!

(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా, బీర్పూర్ గ్రామానికి చెందిన అల్లెపు నర్సింగం (25) అనే కార్మికుడు జీవనోపాధి కోసం దుబాయి లో రోజు మాదిరిగానే డ్యూటీ ముగించుకొని రూముకు వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందాడు.


గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ గుర్రపు రాము అధ్యక్షుడు గుండెల్లి నరసింహ కు విషయం తెలియజేసి ఎలాగైన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరారు. స్పందించిన గుండెల్లి నరసింహ మృతుని కంపని యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతూ పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేయించి మృతుడి కంపని యాజమాన్యం సహకారంతో నిన్న ఇండియా పంపించడం జరిగింది.
హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.
మాకు సహకరించిన కంపనీ యాజమాన్యానికి, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
బాదిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని మా కార్మికుల రక్షణ సమితి (GWPC) తరపున డిమాండు చేస్తున్నాము.
గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) నాయకులు, తదితరులు మృతదేహం తరలింపులో సహకరించాలని వారికి కృతజ్ఞతలు తెలిపారు.