ఎమ్మెల్సీ కవితను నిలదీసిన జీవన్ రెడ్డి..
మీరు నడిచే ప్రతి రోడ్డు కాంగ్రెస్ పాలనలో వేసిందే !
రోళ్ళ వాగు చరిత్ర మీకు తెలుసా.?
సీఎం అహంకారంతో ప్రజల హక్కులు కాలరాస్తున్నారు!
రాయికల్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో
( J. Surender Kumar )
కాంగ్రెస్ పాలనలోనే గ్రామ గ్రామాన రోడ్లు వేసినం.. ఎనిమిదేళ్ల కాలంలో ఒక్కరోడ్డేనా వేశారా.?
వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కూడా దిక్కులేదు.. ప్రతిపక్షాలు అభివృద్ధికి సంబంధించి ప్రశ్నించాల్సి ఉండగా టిఆర్ఎస్ పాలనలో అధికార పార్టీ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతోంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ను ఏం చేశారంటూ ప్రశ్నించడంపై ఆదివారం.రాయికల్.లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కవిత ఆరోపణల కు జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ పాలనలోని కమ్మనూరు కలమడుగు వంతెన, కొత్తపేట వేంపేట్ వెంకట్రావుపల్లి వంతెన,.అసంపూర్తిగా ఉన్న బాధనకుర్తి వంతెన పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ రాగా బోర్నపల్లి వంతెన చేపట్టాలని, ఆదిలాబాద్ లోని మారుమూల పల్లెలకు విద్యా వైద్య సౌకర్యం కలుగుతుందని అంచనాలతో సహా సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. .సీఎం స్పందించి అదే సభలో బోర్నపల్లి వంతెనకు మంజూరు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకే బోర్నపల్లి వంతెన మంజూరు చేశామని ప్రకటించారనీ గుర్తు చేశారు.
ఎమ్మెల్సీగా మీకు బాధ్యత లేదా ? .
గతంలో జగిత్యాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలోనైనా రోళ్ళ వాగు ప్రాజెక్టులు సందర్శించారా ? అని నిలదీశారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు కూడా దిక్కులేదు. రాయికల్ మున్సిపాలిటీ సమీపంలో, కొండాపూర్ మత్తడి రోడ్డు, పూర్తి చేయకపోవడంతో ప్రజలు నాలుగు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. 8 ఏళ్ల క్రితం బోర్నపల్లి- జగన్నాథపూర్ వంతెన నిర్మిస్తామన్న హామీ ఏమైందని అన్నారు. రాయికల్ మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేసి ఏం చేశారు? . ప్రజలు పన్నుల భారంతో సతమతమవుతున్నారు ? ₹25 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న నేటికీ సగం కూడా ఖర్చు చేయలేదన్నారు.

రోల్లవాగు ప్రాజెక్టు చరిత్ర మీకు తెలుసా ?
రోళ్ళ వాగు ప్రాజెక్టు చరిత్ర మీకు ఏమైనా తెలుసా ? అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రోళ్ళ వాగు 0.25 టీఎంసీల నుండి ఒక టీఎంసీ పెంచుతూ ఆధునీకరణ పేరిట ₹ 60 కోట్లు మంజూరు చేయగా, ప్రాజెక్టు నిర్మాణ జాప్యంతో అంచనా వేసి ₹ 130 కోట్లకు చేరిందని, ప్రాజెక్టు మరో కాళేశ్వరం ప్రాజెక్టు అయిందని ఎద్దేవా చేశారు. రోళ్ళ వాగు సాంకేతిక లోపంతో వరదలకు కొట్టుకపోవడంతో కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద ను, ఉపాధిని మత్స్యకారులు కోల్పోయారని అన్నారు. వందలాది ఎకరాల లో ఇసుక మేటలు వేసిందని అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టు తోపాటు, అరగుండాల ప్రాజెక్టు, నుండి సైతం మత్స్య సంపద కొట్టుకుపోయిందని ,ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ? అన్నారు. రైతులకు పరిహారం ఇవ్వడం మత్స్యకారులను ఆదుకోవడం మీ బాధ్యత కాదా ? అని జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థలకు నిధుల విడుదల చేయించడంలో మీకు బాధ్యత లేదా ? అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిల దీశారు. ముఖ్యమంత్రితో ఉన్న సాహిత్యం తో వెంటనే నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో డీ ఏం ఎఫ్ టి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ₹7 కోట్లు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని ,వెంటనే నిధులు మంజూరు చేయించాలన్నారు. ఆత్మీయ సమ్మేళనం, రాజకీయ వేదికగా విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేసుకునే మిషన్ భగీరథ, ఏ మేరకు సరఫరా అవుతుందో ఒకసారి పరిశీలించాలని హితో పలికారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సంబంధించి, అధికార పక్షం ప్రశ్నించడం సలహాలు ఇవ్వడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. టిఆర్ఎస్ పాలల్లో మాత్రం అధికార పార్టీ ప్రతిపక్షాలపై విరుచుకుపడి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు.
సీఎం అహంకారంతో ప్రజల హక్కులు కాలరాస్తున్నారు!
రాష్ట్ర పునర్విభజన చట్టం హక్కులను పొందడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం సీఎం గా కేసీఆర్ బాధ్యత అహంకారంతో, రాష్ట్ర సమస్యలు, అభివృద్ధికి నిధులు కు సంబంధించి ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లకుండా ప్రజల హక్కులను కాల రాస్తున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిని కలిస్తే రామగుండం, హైదరాబాద్ ఎనిమిది లైన్ల రోడ్డుకు నిధులు మంజూరు చేయమని అవకాశం ఉండేది.. కృష్ణా జలాల్లో వాటా కేటాయించాలని కోరే అవకాశం ఉండేది , సీఎం కేసీఆర్ అహంకార పూరిత శైలితో తెలంగాణకు రావాల్సిన నిధులు రావడంలేదని విమర్శించారు. తరచూ కేంద్రం, రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ 2019 వరకు బిజెపితో, మిత్రపక్షంగా ఉన్నారని అప్పుడు ఏం సాధించారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా నుండి తొమ్మిది మండలాలు ఏపీలో కలిపితే ఏం చేశావు? అని ప్రశ్నించారు. పీఎం మోడీని కలిసేందుకు ఎందుకు ముఖం చాటేసుకోవడం, ప్రజల హక్కుల సాధనకు పోరాటం చేయడం మీ బాధ్యత కాదా ? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ,రాజకీయంగా ప్రధానమంత్రి మోడీని విభేదిస్తున్న తమ హక్కుల సాధన కోసం పోరాడుతున్న విషయం కానరావడం లేదా ? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.