ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆద్వర్యంలో.

(J. Surender Kumar)

జగిత్యాల పట్టణంలో ఇందిరా భవన్ లో ఇందిరా గాంధీ చిత్ర పటానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులు అర్పించారు.,

పాత బస్ స్టాండ్ చౌరస్తా లో గల ఇందిరమ్మ విగ్రహానికి పూల మాల వేసి కాంగ్రెస్ నేతలు  డిసిసి అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గిరి నాగభూషణం,.  తదితరులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
విమర్శలు మాని..ధాన్యం కొనుగోలు చేయండి..
ధాన్యం సంచికి 4 కిలోలు కట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.,  ఉమ్మడి రాష్ట్రంలో కల్లాల వద్దే కొనుగోలు చేశాం., రైతులు ధాన్యం కుప్పలా వద్ద పడిగాపులు కాస్తున్నారు. సంచికి 4 కిలోలు కట్ చేస్తున్నారు. ప్రజల సమస్యను పక్క దారి పట్టించేందుకు టి ఆర్ ఎస్, బిజెపి ఒకరి పై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు

. కేంద్రం కొనుగోలు చేయడం లేదని రాష్ట్రం, రాష్ట్రం సహకరించడం లేదని కేంద్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు., ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తరుగు పేరిట కొత్త విధిస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, స్థానిక నాయకులకు ఎం చేస్తున్నారు?  మీకు బాధ్యత లేదా అని నిలదీశారు..త్వరిత గతిన ధాన్యం కొనుగోలు చేయాలి అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కల్లాల వద్దే ధాన్యం  తాలు, తప్పా, తరుగు లేకుండా కొనుగోలు చేశామన్నారు.

సమాజానికి సమస్యలు పరిష్కారం కావాలి..కేంద్రం, రాష్ట్రం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తోడు దొంగలు అని జీవన్ రెడ్డి ద్వజమెత్తారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు మాని విధానాలపై చర్చించండనీ అన్నారు. సమస్యలు పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారను విమర్శించారు.


ధర్మపురి పట్టణంలో..

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఏ. లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో. ధర్మపురి పట్టణం లో నందిచౌక్ వద్ద ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటం కు పూలమాలలు వేసి వారిని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంధీర గాంధీ భారతదేశానికి ఎంతో సేవ చేసిందని 1966 నుండి 77 వరకు మళ్లీ 1980 నుండి 1984లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధానమంత్రిగా పని చేసారు ఆమె గురించి స్మరించుకున్నారు.


ఈ కార్యక్రమంలో సంగనబట్ల దినేష్, వేముల రాజేష్, చిలముల లక్ష్మణ్, సింహారాజు ప్రసాద్,.సుముక్, ఆశెట్టి శ్రీను, అప్పల తిరుపతి, షబ్బీర్, అయ్యోరి మహేష్, సిపతి సత్యనారాయణ, రవియోద్ధిెఫిన్, రాజ్ కుమార్, స్తంభంకాడి గణేష్, శ్రవణ్,  బలాగౌడ్, పరశురాం, మొయిలీ, ప్రశాంత్ నాని,  బాధినేని సత్యనారాయణ,  కసరపు నవీన్, బొల్లారపు పొచయ్య, ముత్తినేని మల్లేష్, సతీష్, మహేందర్, భరత్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.