గోదావరి హారతి ఉత్సవంలో…
మంత్రి ఈశ్వర్ దంపతులు!

( J.Surender Kumar)

జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసం అమావాస్య ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం గోదావరి తీరంలో “గోదావరి హారతి” కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు.

దేవస్థానం వద్దనుండి మంగళవాద్యాలు తోడు రాగా, గోదావరి నదికి ఊరేగింపుగా వెళ్ళారు. రాష్ట్ర మంత్రి ఈశ్వర్, స్నేహలత దంపతులు,.
ఈ సందర్భంగా గోదావరి తీరంలోని మంగలిగడ్డ పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు

గోదావరి నదీ మాతకు మంగళ హారతి, మంత్రపుష్ప నీరాజనాది క్రతువులు నిర్వహించిన అనంతరం సనాతన సాంప్రదాయ రీతిలో నదినీటిలో కార్తీక దీపాలను దొప్పలలో వెలిగించి గోదావరి మాత కు సమర్పించడం జరిగింది..