(J.Surender Kumar )
పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరినది తీరం భక్తజనంతో మంగళవారం సాయంత్రం పోటెత్తింది.
చంద్రగ్రహణం సందర్భంగా. తెల్లవారుజామున ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అనుబంధ ఆలయాలు మూసివేశారు.

స్థానికులు నది తీరంలో ఉండి గ్రహణం పట్టుడు, వీడుచూడు స్నానాలు చేశారు. వేద పండితులు, అనుస్థానపరులు, భక్తజనం, నది తీరంలోనే గంటలపాటు జపాది, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

నదిలో స్నానం చేస్తూ గ్రహణ దోష నివారణ, వేదమంత్రాలు సంకల్పాలు, చెప్పించుకొని భక్తజనం దానధర్మాలు చేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తజనం నదిలో కార్తీక దీపలు వదిలారు.

ఈ సంవత్సరం కార్తీక శు. పూర్ణిమ, మంగళవారం రోజున భరణీ నక్షత్రములో, మేష రాశిలో రాహు గ్రస్త చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం

మధ్యాహ్నం 02:39 నుంచి సాయంత్రం 06:19 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం 02:39 అయినప్పటికీ సూర్యాస్తమయం తర్వాతే పుణ్యకాలం ప్రారంభమైంది.