గుజరాత్ ఎన్నికలో బిజెపి అభ్యర్థులే కోటీశ్వరులు!

డెమోక్రటిక్ రిఫార్మ్ అసోసియేషన్ వెల్లడి !

( J. Surender Kumar)

గుజరాత్‌లో 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబరు 1న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ పార్టీ 79 నియోజకవర్గాల్లో కోటీశ్వరులైన అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా కోటీశ్వరులైన అభ్యర్థులను రంగంలోకి నిలిపినా, బిజెపి అభ్యర్థుల ఆస్తుల కంటే తక్కువ ఉన్నాయి. 89 అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ పార్టీల నుండి 788 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డిసెంబర్ 5న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో 833 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు 1621 మంది పోటీ పడుతున్నారు.

మొత్తం ఓటర్లు 4 కోట్ల, 90 లక్షల, 89 వేల, 765 మంది ఉన్నారు. ఇందులో ట్రాంజెండర్ కు చెందిన ఓటర్లు 1,417 మంది ఉన్నారు.
డెమోక్రటిక్ రిఫార్మ్ అసోసియేషన్ (డీఆర్ఏ,) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది.

₹ 175 కోట్లకు అధిపతి బిజెపి అభ్యర్థి!

రాజ్‌కోట్ సౌత్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ దిలాలా ఆస్తుల విలువ ₹ 175 కోట్లు. రాజ్‌కోట్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఇంద్రనీల్ రాజ్‌గురు, ₹ 162 కోట్ల ఆస్తులున్నాయి.  మానవదర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి జవహర్ చవ్తా ₹ 130 కోట్ల ఆస్తులతో 3వ స్థానంలో ఉన్నారు.  క్రికెటర్ రవీంద్ర జడేజా, భార్య రివాబా జామ్‌నగర్ నార్త్, నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ లో ఉన్నారు. తనకు ₹.97 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వివరించారు.
గుజరాత్ రాష్ట్రంలోని 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ప్రకటించారు. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
89 నియోజకవర్గాల్లో డిసెంబర్ 1న ఓటింగ్ జరుగనున్నది. రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 5 న  93 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

211 మంది మిలియనీర్లలో బిజెపి వారే అధికం!

మొదటి దశ ఎన్నికలకు 788 మంది అభ్యర్థులలో 211 మంది కోటీశ్వరులు. మొత్తం అభ్యర్థుల్లో 27 శాతం మంది మిలియనీర్లు. బీజేపీకి అత్యధికంగా మిలియనీర్లు ఉన్నారు. దీని ప్రకారం 89 నియోజకవర్గాల్లో 79 మంది బీజేపీ సభ్యులు కోటీశ్వరులు. మొత్తం బీజేపీ అభ్యర్థుల్లో 89 శాతం మంది కోటీశ్వరులేనని DRA ప్రకటించింది.

కాంగ్రెస్-ఆమ్ ఆద్మీలో…

65 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కోటీశ్వరులు. ఇది కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్యలో 73 శాతం, ఆప్‌లో 33 మంది అభ్యర్థులు ఉన్నారు. 89 నియోజకవర్గాల్లో 88 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 38 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులే.

₹.5 కోట్లకు పైగా!

73 మంది అభ్యర్థులు ₹ 5 కోట్లకు పైబడి, 77 మంది అభ్యర్థులకు ₹ 2 కోట్ల నుంచి ₹.5 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నట్టు DRA ప్రకటనలో పేర్కొంది. మరో 125 మంది అభ్యర్థులకు ₹ 50 లక్షల నుంచి ₹ 2 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.  పార్టీల వారీగా బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 13.40 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 8.38 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 1.99 కోట్లుగా పేర్కొన్నారు.

నయా పైసా లేదు !

రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపేంద్ర పటోలియా, తనకు ఎలాంటి ఆస్తులు, నయా పైసా ఆస్తులు లేవని అఫిడవిట్‌లో తన ఆస్తి విలువ శూన్యమని పేర్కొన్నారు.   వైరా (ప్రత్యేక) నియోజకవర్గం, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి రాకేష్ కమిత్ ఆస్తి విలువ ₹ 1000/- భావ్ నగర్ (పశ్చిమ) నియోజకవర్గంలో, జేబిన్ బోర్సా ఆస్తి విలువ ₹ 3000/- పోటీ చేస్తున్న సమీర్ షేక్ ఆస్తి విలువ రూ. సూరత్ తూర్పు నియోజకవర్గం, పోటీ చేస్తున్న సమీర్ షేక్, అతని ఆస్తి విలువ ₹.6,500./- అని పేర్కొన్నట్టు DRA వివరించింది.