గుజరాత్ ఎన్నికల్లో 330 మంది అభ్యర్థులపై క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి !
మొత్తం 192మంది అభ్యర్థులపై హత్య, హత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు!
కాంగ్రెస, అప్,బిజెపి వాళ్ళు 96 మంది !
హమ్ ఆద్మీ పార్టీకి చెందిన 61 మంది అభ్యర్థులు నేర నేపథ్యంతో అగ్రస్థానంలో ఉంది!
(J. SURENDER KUMAR)
గుజరాత్ ఎన్నికలలో 61 మంది నేర నేపథ్య అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది.
61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య 238.
రెండు దశల అభ్యర్థుల సర్వే అనంతరం ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, కాంగ్రెస్‌కు చెందిన 60 మంది అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి చెందిన 32 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం మరియు హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేయబడ్డాయి, వీరిలో 96 మంది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు ఆప్‌కి చెందినవారు, పోటీలో ఉన్న మొత్తం 1,621 మంది అభ్యర్థుల అఫిడవిట్‌ల పరిశీలించిన పిదప నేర ఆరోపణల వివరాలను ఎడిఆర్ ప్రకటించింది.

డిసెంబర్ 1 మరియు 5 తేదీల్లో రెండు దశల ఎన్నికల జరుగాన్నయి
వారి పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్న 330 మంది అభ్యర్థులు మొదటి దశలో 167 మంది 89 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం 788 మంది అభ్యర్థులలో, 163 మంది రెండో దశలో 93 స్థానాల్లో మొత్తం 822 మంది పోటీలో ఉన్నట్లు ADR విశ్లేషణ వెల్లడించింది.
తీవ్రమైన నేరాలకు పాల్పడిన అభ్యర్థుల విషయానికొస్తే, ఆప్ 43 మందితో అగ్రస్థానంలో ఉంది, కాంగ్రెస్ 28 మరియు బీజేపీ 25 మందితో రెండో స్థానంలో ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మరియు బీజేపీ నుండి వరుసగా 181, 179 మరియు 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 182 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీ.
తీవ్రమైన నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణించనున్నట్టు ADR తెలిపింది, ఇది గరిష్టంగా ఐదేళ్లు మరియు అంతకంటే ఎక్కువ శిక్షను కలిగిస్తుంది. దాడి, హత్య, కిడ్నాప్ మరియు అత్యాచారం, అలాగే మహిళలపై నేరాలు మరియు అవినీతి కేసులకు సంబంధించిన నేరాలు.
18 మంది అభ్యర్థులు, మహిళలపై నేరాలకు పాల్పడగా, ఒక అభ్యర్థిపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. ఐదుగురు అభ్యర్థులపై హత్య ఆరోపణలు ఉన్నాయి. 20 మంది అభ్యర్థులు హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అహ్మదాబాద్ జిల్లాలోని దస్క్రోయ్, స్థానం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తున్న కిరణ్ పటేల్‌పై, హత్య కేసు నమోదైంది. పటాన్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై, హత్యాయత్నం కేసు నమోదు చేయగా, పంచమహల్ జిల్లాలోని షెహ్రా స్థానం నుండి పోటీ చేస్తున్న బిజెపికి చెందిన జెథా భర్వాద్, అత్యాచారం, అపహరణ, దోపిడీ, మహిళ పై లైంగిక వేధింపులు మొదలైన అభియోగాలు మోపారు.
అభ్యర్థుల ఎంపిక సమయంలో రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపలేదని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.