(J.Surender Kumar)
జగిత్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( జగిత్యాల శాఖ ) బ్యాంకు మేనేజర్ కు జిల్లా వినియోగదారుల న్యాయస్థానం నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసింది
.వివరాల్లోకి వెళితే
జిల్లాలోని కొడిమ్యాల మండలం రామ కృష్ణాపూర్ గ్రామానికి చెందిన మోహిని 2013 సంవత్సరంలో తన భర్త పేరిట బ్యాంకులో డిపాజిట్ ఉన్నడబ్బులు ఇవ్వాలని కోరగా మేనేజర్ తిరస్కరించాడు. దీంతో ఆమె కరీంనగర్ జిల్లా. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. ఫోరం ఈమెకు అనుకూలంగా డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. అయినా మేనేజర్ డబ్బులు ఇవ్వకపోవడంతో, రాష్ట్ర వినియోగదాల న్యాయస్థానంను , మోహిని ఆశ్రయించింది. గతంలో ఇచ్చిన జిల్లా తీర్పును వారు సమర్థిస్తూ మేనేజర్ ను చెల్లించాల్సిందిగా ఆదేశించారు. ఈనెల 16న జిల్లా వినియోగదారుల కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ మేనేజర్ హాజరు కాకపోవడంతో, న్యాయమూర్తిని స్వరూప రాణి, సభ్యులు శ్రీలత, నరసింహారావు లు మేనేజర్ పై నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
₹ 3 లక్షలు చెల్లించాలి ఆసుపత్రి యాజమాన్యం కు ఆదేశాలు!

ఆస్పత్రిలో జరిగిన శస్త్ర చికిత్స ( ఆపరేషన్) వైఫల్యం వల్ల ఇబ్బందులకు గురి అయిన బాధితుడికి ₹ 3. మూడు లక్షల నష్టపరిహారం 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, ఆస్పత్రి యాజమాన్యం కు కరీంనగర్ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి !
జగిత్యాల పట్టణం వాణి నగర్ కు చెందిన రాంపూర్ గంగన్న, 2009 లో. కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రిలో మోకాలి నొప్పులకు ఆపరేషన్ చేయించుకొని జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళాడు. నొప్పి యధావిధిగా ఉండడంతో హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో వారు మరోసారి మోకాలిక ఆపరేషన్ చేశారు. వైద్య సేవలు లోపంపై జిల్లా ఆసుపత్రి యాజమాన్యం కు గంగన్న ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈనెల 16న న్యాయమూర్తిని స్వరూప రాణి, సభ్యులు శ్రీలత, నరసింహారావు లు సంచలన తీర్పు ఇచ్చారు. గంగన్నకు ఖర్చుల నిమిత్తం ₹ 5000/ , 6% వడ్డీతో కలిపి గంగన్నకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది మేట్ట మహేందర్ బాధితుల పక్షాన వాదించారు.