జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం!

(J. Surender Kumar)

జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి లో. భవనంలో బుధవారం C.T స్కానింగ్ సెంటర్ ను  మంత్రి కొప్పుల ఈశ్వర్ , స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ శ్రావణి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, బుగ్గారం జడ్పిటిసి సభ్యులు బాదినేని రాజేందర్, ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ బుధవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసింది.  ముఖ్య అతిథిగా హాజరైన  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,  జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా  కాంపెల్లి హనుమాండ్లు, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి  మొదటగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు పాలక వర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ,నియోజకవర్గ పాక్స్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకరులు, ప్రజలు పాల్గొన్నారు.

హాస్టల్ భవన నిర్మాణంకు భూమి పూజ!

జగిత్యాల పట్టణంలోని  బసవేశ్వర విగ్రహం దగ్గర.₹ 1 కోటి 30 లక్షల ఎస్టీ హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రి ఈశ్వర్ భూమిపూజ చేశారు.  స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ , లైబ్రరీ ఛైర్మెన్  చంద్రశేఖర్ గౌడ్  ,కలెక్టర్  రవి,  మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్,  వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్  ,జిల్లా గిరిజన అభివృద్ధి శాక అధికారి మడవి గంగారాం, కౌన్సిలర్ లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.