జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ !

జగిత్యాల జ్యోతి హై స్కూల్, ఐఐటీ విద్యార్థులు

(J. Surender Kumar)

కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో 3 రోజుల పాటు జాతీయ స్థాయి కరాటే పోటీలలో జరిగాయి. 15 రాష్ట్రాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో పాల్గొన్నారు.

జ్యోతి ఐఐటీ విద్యార్థులు వి హర్ష గౌతమ్, కటా విభాగంలో బంగారు పథకం సాధించగా, బాలికల కటాలో విభాగంలో జ్యోతి హైస్కూల్ విద్యార్థినిలు డి జాగృతి, డి హిమభిందు కాంస్య పథకాలు సాధించారని పాఠశాల డైరెక్టర్ హరిచరణ్ రావు తెలిపారు.

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమం లో డైరెక్టర్ హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు , కరాటే మాస్టర్ ఎం శ్రీనివాస్, అధ్యాపక బృందం, తదితరులు అభినందించారు.