జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం!

కలెక్టర్ పాల్గొని దివ్యాంగులను ఉత్సాహపరిచారు!

( J.Surender Kumar)

ఈ రోజు జగిత్యాల లోని వివేకానంద మినీ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళ శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో బుధవారం దివ్యంగులకు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రవి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులను ఉత్సాహపరుస్తూ జెండా ఊపి ఆటలను ప్రారంభించారు,


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది , జిల్లా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ సహకారంతో మొన్ననే జిల్లాలోని దివ్యంగా సోదరులలు స్కూటీలు అందించడం జరిగింది అని తెలిపారు

, దివ్యంగులు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికి ERS మరియు ఎయిడ్స్ అండ్ అప్పీలెన్స్ , మ్యారేజ్ ప్రోత్సాహకాలు అందిస్తుంది అని తెలిపారు,


జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్ ఆటల పోటీల వివరాలు మరియు క్రీడాకారుల వివరాలు వెల్లడించారు
జిల్లా దివ్యంగులు క్రీడా పోటీలకు వికలాంగుల సంక్షేమ శాఖ నుండి ప్రత్యేక ఉపాధ్యాయడు ఉల్గొజు రమేష్ హాజరైనరు కార్యక్రమ వివరాలు హైదరాబాద్ డైరెక్టర్ కార్యాలయానికి తెలిపారు


ఈ కార్యక్రమంలో దివ్యంగుల రాష్ట్ర కమిటీ సభ్యులు బండి సత్యం గారు జిల్లా దివ్యంగుల సంగం అధ్యక్షులు ప్రవీణ్ గారు VJAC జిల్లా కన్వీనర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు