జోడో యాత్రలో అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ !

రాహుల్ గాంధీతో ముచ్చట్లు !


( J. Surender Kumar )
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న ‘భారత్ జోడో యాత్ర’ లో సోమవారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

జుక్కల్ నుండి మహారాష్ట్ర వరకు నడుస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ గారితో 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలంగాణలో ఏమి నడుస్తుందని అని అడిగారు. లక్ష్మణ్ కుమార్ ప్రస్తుత తెలంగాణలో పరిస్థితులను వివరిస్తూ దళిత బంధు స్కీమ్ లో జరుగుతున్న అన్యాయాలను, దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి, మరియు ఇండ్ల గురించి రాహుల్ గాంధీ కి వివరించారు.

అనంతరం అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడు బట్టి, మాజీమంత్రి మంచిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ అగ్ర నేతలు అక్కడి శిబిరంలో మంతనాలు జరిపారు.


జోడో యాత్ర లో టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న జోడో పాదయాత్ర లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి యాత్ర లో పాల్గొన్నారు.. రాహుల్ గాంధీ పాదయాత్ర తో దేశంలో పెను మార్పులు రావడం ఖాయం అని అన్నారు. జోడో యాత్ర లో మెటుపల్లి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి . కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఏలేటి మహిపల్ రెడ్డి. పైడిమడుగు గ్రామ అధ్యక్షుడు జనార్ధన్. ఇబ్రహీంపట్నం మండల నాయకులు. భాస్కర్ రెడ్డి. కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పన్నాల అంజిరెడ్డి. మెటుపల్లి పట్టణ,మండల అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, అక్కపెళ్లి ,తదితరులు పాల్గొన్నారు.