జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం అవసరం!


కనీస వేతనంతో పాటు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి
టీయూడబ్ల్యూజే (143 ) ఉపాధ్యక్షులు లాయక్ పాషా !

(J. Surender Kumar)


జాతీయ పత్రికా దినోత్సవ వేడుకను పురస్కరించుకొని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే హెచ్ 143 కన్వీనర్ లాయక్ పాషా,జాతీయ స్థాయి జర్నలిస్టు సమాజానికి ప్రకటనల లో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులకు, జర్నలిస్టు సమాజానికి భద్రత కరువైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులను నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరహంతకులు హతమారుస్తున్న ఘటనలను అభ్యుదయవాదులు, జాతీయతావాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ భద్రత లేని జర్నలిస్టుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు సమాజానికి భద్రతను కల్పిస్తూ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలం జర్నలిస్టు వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనం, పెన్షన్ సదుపాయాలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ప్రకటనలు డిమాండ్ పేర్కొన్నారు.