( J. Surender Kumar)
జగిత్యాల పట్టణంలో ని గీతా భవన్ లో మున్సిపల్ పరిధికి చెందిన 72 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ
బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో 2 వేల రూపాయల పెన్షన్
మహిళల పేరు పైన రేషన్ కార్డ్ లు,డబల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తున్నాం…రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం..
జగిత్యాల పట్టణంలో నలువైపులా మార్కెట్ లు,పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజలకు సౌలభ్యం…
జగిత్యాల పట్టణంలో బీద బడుగు బలహీనర్గాలకు 4520డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
త్వరలోనే అర్హులకు అందజేయటం జరుగుతుంది అని అన్నారు.
జగిత్యాల లో జోన్ల మార్పు చేయడం ద్వారా సజావుగా ఇండ్ల నిర్మాణ అనుమతులు, గతంలో అక్రమ నిర్మాణాలు.
ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ప్రతి రోజు కోడి గుడ్డు, పోషక ఆహారం అందిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో జూనియర్ కాలేజి మంజూరు.
రాష్ట్రం లో 1000 కి పైగా గురుకులాలు ఏర్పాటు ముఖ్యమంత్రి గారి ఘనత. అన్నారు
అన్ని కుల సంఘాల,కుల వృత్తులు అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం తోనే రాజకీయాల్లోకి వచ్చాను..
ఎంపి ధర్మపురి అరవింద్ దొంగల ముఠాతో జత కట్టి కవిత ను ఓడించారు…
అందులో బాండ్ పేపర్ నాటకం ఒకటి…
ఢిల్లీ లో కోట్లాడి గల్లి లో మాత్రం బీజేపీ – కాంగ్రెస్ దోస్తీ….
రైతుల ముసుగులో వందల సంఖ్యలో నామినేషన్ లు వేసి ప్రజలను ఆగం చేసినారు ……
ఇప్పుడు ముసుగు తీసి బీజేపీ కండువా కప్పుకున్నారు…
ధర్మపురి – జగిత్యాల నియోజకవర్గానికి ఎం చేశారో చెప్పాలి….ఇప్పటి జగిత్యాల అభివృద్ధికి కవిత కారణం..
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, పట్టణ పార్టీ మహిళ అధ్యక్షురాలు కచ్చులత, ఎమ్మార్వో వకీల్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.