ఆలయ భూమిలో మొక్కలు తిన్నది ఎవరు ?
₹ 6 లక్షల నిధుల ఖర్చు తో
(J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో మొక్కలు కనబడడం లేదు, వాటి నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్టు, క్యాష్ బుక్ లో లెక్కలు కనబడుతున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పెంచిన మొక్కలను తిన్నది ఎవరో ? నరసింహుడే గుర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే..
ధర్మపురి పట్టణ శివారులో దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి సర్వేనెంబర్, 564 లో.0.21 ( ఇరువది ఒకటి) గుంటల భూమి ఉన్నట్టు రికార్డులో పేర్కొనబడింది.

అట్టి భూమి వ్యవసాయ యోగం కాదని, రాళ్లు రప్పలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. భవిష్యత్తులో నరసింహస్వామి ఆలయం కు మామిడాకులు, తులసి, పువ్వుల, అవసరాల నిమిత్తం హద్దులు గుర్తించి కొంతమేరకు ఫెన్సింగ్ చేసి (దేవస్థానం భూమి అంటూ ఓ బోర్డు పెట్టారు, ప్రస్తుతానికి ఆ బోర్డు మాయమైంది ) గేటు ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 20 నుంచి 30 మామిడి మొక్కలను ఆ భూమిలో నాటారు. వాటికి నీటి వసతి కోసం ఆలయ సిబ్బంది, ట్యాంకర్ల ద్వారా అక్కడికి వెళ్లి మొక్కలకు నీరు పోసేవారు. (ఆలయ రికార్డులలోఈ అంశం నమోదు అయినట్టు సమాచారం)
నిర్వహణ, పనుల కోసం ₹ 6,68,927/- ఖర్చు !

2018 — 2019 నుండి 2020 – 2021 నాటి వరకు మొక్కల, తోటల ,పెంపకం నిర్వహణ కోసం ఆలయ నిధుల నుండి ₹ 6, 68, 927/- ఖర్చు చేసినట్టు క్యాష్ బుక్కులో లెక్కలు నమోదు అయినట్టు సమాచారం. 2018 -19 లో మొక్కలు తోటలో పెంపకంకు S.B ₹ 12,000/ బడ్జెట్ మంజూరు కాగా ₹ 10,150/- ఖర్చు , నిర్వహణ పనుల కోసం. S.B ₹ 2,10,000/- మంజూరు కాగా, నిర్వహణ పనుల కోసం ₹ 2, 03, 308/- ఖర్చు, 2019 – 2020 లో మొక్కల పెంపకం కోసం బడ్జెట్ ₹ 1,00000/- మంజూరు కాగా ఎలాంటి ఖర్చు చేయలేదు. నిర్వహణ పనుల కోసం ₹ 3, 00000/- బడ్జెట్ మంజూరు కాగా ₹ 2, 63, 047/- ఖర్చు, 2020 -21 లో మొక్కల తోటల పెంపకం కు. బడ్జెట్ ₹ 30,000/- మంజూరు కాగా, ₹ 26, 900/- ఖర్చు, నిర్వహణ పనులకు ₹.2,50,000/- బడ్జెట్ మంజూరు కాగా ₹ 2,02,572/- ఖర్చు అయినట్టు రికార్డులో పేర్కొన్నట్టు సమాచారం.
మొక్కలు తిన్నది ఎవరు ?
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం, పచ్చ తోరణాల కోసం పూజాది కార్యక్రమాలకు తులసి, పూల మొక్కల, పెంపకం తదితర మొక్కల రక్షణకై ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఆ స్థలానికి గేటును అమర్చారు. మొక్కలను పశువులు తినకుండా భద్రతా చర్యలు చేపట్టినట్టు సమాచారం. అయితే ఈ స్థలంలో పిచ్చి (శుక్రవారం నాటికి 18 నవంబర్) మొక్కలు, గడ్డి ,పెరిగి ఉంది. ఒకే ఒక మామిడి చెట్టు. (ఆ చెట్టు దాదాపు నాలుగు సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది ) నాలుగైదు సంవత్సరాల క్రితం అధికారులు గాని, భక్తులు గాని . ఇంత దూరాన ఒక్క మామిడి మొక్క నాటాల్సిన అవసరం ఉండి ఉండకపోవచ్చు. ఎన్ని మామిడి మొక్కలు నాటారు, తదితర వివరాలు ఆలయ పాత రికార్డు పుస్తకాలలో నమోదయి ఉన్నట్టు సమాచారం.
విజిలెన్స్, ఏసీబీ అధికారులు జోక్యం చేసుకొని ఆలయ భూమిలో నాటిన మొక్కల ను. తిన్నది ఎవరు ? విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు చేసుకోవాలని భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.