కష్టపడి పండించిన పంట – అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సిందేనా ?

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

(J. Surender Kumar)
అదనపు తూకంతో  రైతులు క్వింటాల్ కు  5 కిలోలు నష్టపోతున్నారు., ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు కష్ట పడాల్సి వస్తోంది.ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాయికల్ మండలం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.  శివాజి విగ్రహం నుండి మార్కెట్ యార్డుకు బైక్ ర్యాలీ తో తరలి వెళ్లి, మార్కెట్ ను పరిశీలించారు., మార్కెట్ స్థలం లో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారని, కలెక్టర్ కు విన్నవించినా స్పందన లేదని జీవన్ రెడ్డి ఎదుట రైతులు వాపోయారు. 

అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లి తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం నాణ్యతను అధికారులు నిర్ధారించిన తర్వాత కూడా తాలు ఉందంటూ మిల్లర్లు కొత్త విధించడం ఏమిటని  నిలదీశారు., మిల్లర్ అదనపు తూకం వేయాలంటూ ఒత్తిడి చేయడంపై పాక్స్ సీఈఓ పై చర్యలు తీసుకోవడం ఏమిటి..మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. రైతులు ఒక కిలో అదనపు తుకానికి అంగీకరించినా కోత విధిస్తుండడం దారుణమన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారివి ఎందుకు తిరస్కరించారో చెప్పడం లేదని, ప్రజల సమస్యలపై లేఖ రాసినా స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు., ధరణితో భూ సమస్యలు  మెరుగైన పద్దతిలో అమలు చేయపడాలి. జీపీఎస్ పద్దతి లో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భు సరిహద్దులు  చేపడుతామని అసెంబ్లీ లో ప్రకటించినా ఇప్పటి వరకు అమలు కాలేదు అని విమర్శించారు. రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. వస్తపుర్ లో ఓ వ్యక్తికి పట్టాదారు పుస్తకం ఉంది..రైతు బంధు వస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదే అంటున్నారు. ధరణితో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.,
భూమి లాక్కొని రైతు నోట్లో మట్టి కొట్టోద్దు., మార్కెట్ నిర్వహణ కోసం స్థలం లేకపోవడంతో రైతులు 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి మార్కెట్ కు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్ లో  గిడ్డంగుల నిర్మాణం ఆహ్వానించదగ్గది.
రైతుల కోసం మరింత భూమి కొనుగోలు చేయాల్సి ఉండగా, ఉన్న స్థలాన్ని ఇతర పనులకు కేటాయించడం ఏమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు., సమీకృత మార్కెట్ పేరిట వ్యవసాయ మార్కెట్ భూమి లాక్కొని రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని హితవు పలికారు. మార్కెట్ భూమి సేకరణ నిలిపివేయాలని, భూమిని రక్షించుకునేందుకు
ప్రాణత్యాగానికైనా సిద్దేమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల రూరల్ మండలంలో..

రాష్ట్రంలో  వరిధాన్యం సేకరణలో సమస్యలు పరిష్కరింప చేయుటతో పాటు రుణమాఫీ మరియు ధరణి కి సంబంధించిన సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల రూరల్, అర్బన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కలిసి జగిత్యాల రూరల్, అర్బన్, తహశీల్దార్ కార్యాలయంలో MRO లకు వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో రూరల్ , అర్బన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజెంగి నందయ్య, జున్ను రాజేందర్, శ్రీరాముల గంగాధర్,చందా రాదకిషన్, మాజీ mpp ధర రమేష్ బాబు,పొగళ్ల శ్రీనివాస్ రెడ్డి,mptc కర్నే భూమరెడ్డి, బందెల శంకర్,మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెవుల గంగన్న,అంకతి గంగాధర్,గొంటి మోగిలి, లక్ష్మణ్ ,ముదిగొండ శేఖర్, మునిందర్ రెడ్డి,భారతపు గంగాధర్,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
బుగ్గారం మండలం.లో


బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా.,
ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *వేముల సుభాష్* మాట్లాడుతూ ధరణి పోర్టర్  వెంటనే రద్దు చేయాలనీ, ఐకేపీ సెంటర్ లలో రైతుల పై మిల్లర్ల దోపిడీని వెంటనే అరికట్టాలి రైతుల యొక్క రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వం న్నీ డిమాండ్ చేసి తగు సమస్యలు తీర్చాలని బుగ్గారం తహశీల్దార్ కి వినతిపత్రాన్ని అందచేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెద్దనవేని శంకర్,
నగునూరి నర్సగౌడ్, నగునూరి రామగౌడ్,గాలిపెళ్లి వెంకన్న,
చిన్నపూర్ చారి,గుగ్గిళ్ల చెంద్రయ్య,బాలసాని గంగారాం,
గజ్జెల విజయ్, రహమద్ ఖాన్,పోనకంటి కైలాసం, నగునూరి
వెంకన్న, రేంటం శ్రీధర్,తన్నీరు రాజేశం, భీమ్
సింగ్,కోడీమ్యాల రాజన్న, నక్క శంకర్, రైతులు, కార్యకర్తలు
పాల్గొన్నారు

బీర్పూర్ మండలంలో..

మండల పరిషత్ అధ్యక్షుడు  రమేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు. రాస్తారోకో నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ధర్మపురి మండలంలో..

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు , రైతు సమస్యలు ధరణి , వడ్లు కొనుగోలు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరి కి నిరసనగా 63 నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు.