కొండగట్టు ఆలయ అవినీతిపై..
విచారణకు కమిషనర్ ఆదేశాలు!

విచారణ అధికారిగా ఆర్ జె సి నియామకం!

(J. Surender Kumar)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిధుల గోలుమాలు, అవినీతి తదితర ఆరోపణలపై దేవాదాయ శాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ విచారణకు ఆదేశించారు.

ఆలయ నిధులు దుర్వినియోగం అవకతవకలు గూర్చి అక్టోబర్ మాసంలో ‘ ఉప్పు’ లో కథనాలు ప్రచురితం అయిన విషయం తెలిసిందే.
రీజనల్ జాయింట్ కమిషనర్ ( R.J.C ) కృష్ణ ప్రసాద్, విచారణ అధికారిగా కమిషనర్ నియమించారు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారిగా కొనసాగుతున్నారు.

నిధుల దుర్వినియోగం, క్యాష్ బుక్కులో తగ్గించి నమోదు చేయడం, బాధ్యులైన ఉద్యోగి తిరిగి ఆ నిధులు ఆలయ ఖాతాలో జమ, తదితర అంశాల నేపథ్యంలో కమిషనర్ విచారణకు ఆదేశించారు.
ఆరోపణల నేపథ్యంలో కొమురవెల్లి దేవస్థానం కు బదిలీ అయి అక్కడ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని ఈనెల 29న కొండగట్టు ఆలయ కార్యాలయంలో జరుగు విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిందిగా. నోటీసులు జారీ చేశారు.
నిధుల దుర్వినియోగం, అవకతవకలకు సంబంధించిన రికార్డులు, అభ్యంతరకరమైన పద్దుల వివరాలు, ఆడిట్ అధికారులు ఆక్షేపించిన పద్దుల, వివరాలను రికార్డులు అందుబాటులో ఉంచాలని కొండగట్టు ఆలయ కార్యనిర్వహణాధికారికి ముందస్తు సమాచారం ఇచ్చారు.

కొండగట్టు ఆలయంలో విచారణ !
పాలకవర్గ చైర్మన్ ఫిర్యాదు తో ?

కొండగట్టు ఆలయంలో బుధవారం హైదరాబాద్ దేవదాయశాఖ కు చెందిన అధికారిని ఏడిసి జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, బుధవారం కొండగట్టు ఆలయంలో విచారణ చేపట్టినట్టు సమాచారం. కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు, సమయపాలన పాటించడం లేదని, నిధుల 30% పరిధి అతిక్రమించిందని, అనవసర ఖర్చులతో ఆలయానికి ఆదాయంకు గండి పడుతుందని తదితర అంశాలపై హైదరాబాదులో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం విచారించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఆలయ నిధుల అవకతవకలు, అవినీతి ఆరోపణల పట్ల అనిల్ కుమార్ , విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఉద్యోగుల సర్వీసు రూల్స్ నిబంధన మేరకు చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. దేవాదాయ శాఖలో కొన్ని ఆలయాలు మినహా అధిక శాతం ఉద్యోగులు ట్రెజరీ ద్వారా జీతభత్యాల పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వీరు ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణంలోకి రానున్నట్టు చర్చ నెలకొంది.