అదనపు కలెక్టర్ బిఎస్ లత
( J. Surender Kumar.)
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు .
శనివారం రోజున కొడిమ్యాల మండలంలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అప్పారావుపేట్ , చెప్యాల, కొడిమ్యాల, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలను వెంటనే లారీలలో లోడు చేసి రైస్ మిల్ లకు తరలించాలన్నారు. అవసరం ఉన్నచోట ఎక్కువ హమాలీలను ఎక్కువ ఉపయోగించుకొని కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు.. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం తూకం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ , . జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మల్లేశం , సీసీలు రాజు., మంగ, కొనుగోలు కమిటీ నిర్వహకులు. రైతులు పాల్గొన్నారు