దుకాణదారుడు కి జరిమానా !
(J. Surender Kumar)
ఆనందంతో, కేరింతలు కొడుతూ, ఆడుకుంటున్న పిల్లవాడి బొమ్మ పనిచేయకపోవడంతో ఆ పసి హృదయం తలడిలింది. బొమ్మ కోసం మారం చేస్తూ తినడం మానేశాడు. కన్నా తండ్రి పసివాడు అనుభవిస్తున్న వేదనను చూసి తట్టుకోలేకపోయాడు.
బొమ్మ కోసం వంద కిలోమీటర్లు దూరంలో గల పట్టణం కు వెళ్లి బొమ్మను కొనుగోలు చేసిన దుకాణదారునితో, నీ వద్ద వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన బొమ్మ పనిచేయడం లేదు, అట్టి బొమ్మను మరమ్మత్తు చేసి ఇవ్వండి, లేదా మరో బొమ్మను అయినా ఇవ్వండి అంటూ కోరాడు.
బొమ్మలు విక్రయించే దుకాణదారుడు, తండ్రి మాటలు పట్టించుకోలేదు. తాము ఏమి చేయలేమని, మీ ఇష్టం అంటూ మరమ్మతు చేయడానికి గాని, మరో బొమ్మ ఇవ్వడానికి గాని వారు వ్యతిరేకించారు. దీంతో న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.

మరో దుకాణంలో ఇలాంటి బొమ్మను కొనుగోలు చేసి పసివాడికి అందించిన తండ్రి వాడి కళ్ళల్లో ఆనందం చూశాడు. పసివాడైన తన కొడుకు అనుభవించిన మానసిక వేదన ఏ పిల్లోడు అనుభవించవద్దు అనే ఉద్దేశంతో. రెండు మూడు సార్లు దుకాణదాడి వద్దకు వెళ్లి వారంటీ, గ్యారెంటీ లేని బొమ్మలు పిల్లలకు ఎలా విక్రయిస్తారంటూ ? ప్రశ్నించినా వారిలో స్పందన కరువైంది.
దీంతో ఆ తండ్రి వినియోగదారుల ఫోరంను (కోర్టు) ఆశ్రయించి, డాక్యుమెంట్లు సమర్పించారు. ఫోరం న్యాయమూర్తి, బొమ్మ కొనుగోలు చేసిన మొత్తానికి 9% వడ్డీతో చెల్లించడంతోపాటు ఖర్చుల నిమిత్తం మరో ₹ 3000/- ( మూడు వేల రూపాయలు) ఆ తండ్రికి చెల్లించాలని తీర్పునిచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి!
జగిత్యాల్ పట్టణం కు చెందిన రేపల్లె హరికృష్ణ రావు. ( మాజీ కౌన్సిలర్) తన కుమారుడి కోసం కరీంనగర్ పట్టణంలోని ప్రసిద్ధ బొమ్మల దుకాణంలో 2017 సెప్టెంబర్ 27న ₹ 7,310/- చెల్లించి బేబీ హగ్ అనే బొమ్మను కొనుగోలు చేశాడు. ఆ బొమ్మ వారం రోజులకే మురాయించడంతో, అదే సంవత్సరం అక్టోబర్ మాసంలో కరీంనగర్ కు వెళ్లి దుకాణదారుడికి బొమ్మ పరిస్థితిని వివరించాడు. మరమ్మత్తులు చేసే ఇవ్వండి లేదా మరో బొమ్మ ఇవ్వండి అదనంగా చార్జ్ అయిన చెల్లిస్తానంటూ వారికి వివరించాడు.
వారు స్పందించకపోవడంతో అదే సంవత్సరం డిసెంబర్ 9న ఆ బొమ్మను వారికి అప్పగించి, తన సమస్యను రిజిస్టర్ పోస్టు ద్వారా దుకాణం దారుడికి ఫిర్యాదు చేశాడు.
అయినా దుకాణదారుడు పట్టించుకోక పోవడంతో. కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరంలో. ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా న్యాయం కోసం దుకాణదారుడి పై ఫిర్యాదు చేశాడు.
వాదన ప్రతి వాదనలు విన్న న్యాయమూర్తి, సభ్యులు న్యాయవాది మహేందర్ వాదనతో ఏకీభవించారు. నవంబర్ 18 న బొమ్మ కొనుగోలుకు చెల్లించిన డబ్బులకు, ,9% వడ్డీతో సహా కొనుగోలుదారుడికి చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం మరో ,₹ 3000/- (మూడు వేల రూపాయలు) కొనుగోలుదారుడికి చెల్లించాలని బొమ్మల దుకాణం దారుడిని ఫోరం అధ్యక్షురాలు ( న్యాయమూర్తి) స్వరూప రాణి, సభ్యులు శ్రీలత, నరసింహారావులు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.